Share News

కావాలని నోబ్‌ వేస్తే.. బౌలింగ్‌పై నిషేధం

ABN , Publish Date - Jul 22 , 2026 | 05:23 AM

రాబోయే దేశవాళీ సీజన్‌కు ముందు బీసీసీఐ ఆట నిబంధనల్లో కీలక మార్పును అమలు చేయనుంది. ఇకపై బౌలర్‌ ఉద్దేశపూర్వకంగా ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌ వేసినా..

కావాలని నోబ్‌ వేస్తే.. బౌలింగ్‌పై నిషేధం

దేశవాళీ సీజన్‌లో అమల్లోకి

బెంగళూరు: రాబోయే దేశవాళీ సీజన్‌కు ముందు బీసీసీఐ ఆట నిబంధనల్లో కీలక మార్పును అమలు చేయనుంది. ఇకపై బౌలర్‌ ఉద్దేశపూర్వకంగా ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌ వేసినా, లేక బంతిని పిచ్‌పై పడకుండా విసిరినా.. అతడిపై ఆ ఇన్నింగ్స్‌కే గాకుండా మొత్తం మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయకుండా నిషేధం విధిస్తారు. ఇప్పటికే ఈ విషయాన్ని అన్ని రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు బీసీసీఐ చేరవేసింది. 2026-27 సీజన్‌ నుంచే బోర్డు ఈ రూల్‌ను అమలు చేయనుంది. అలాగే రోజు ఆట చివరి ఓవర్‌ మధ్యలో వికెట్‌ పడినా.. మిగతా బంతులను పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో వికెట్‌ పడగానే ఆటను ముగించేవారు. కానీ ఆఖర్లో కొత్త బ్యాటర్‌ను పంపేందుకు ఆయా జట్లు ఇష్టపడడం లేదు. అందుకే ఈ నిబంధనను సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ప్లేయర్.. జాగ్రత్తగా తీర్చిదిద్దాలి: సికందర్ రజా

రోహిత్ శర్మ ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: రవి శాస్త్రి

Updated Date - Jul 22 , 2026 | 05:23 AM