Share News

వరుణ్‌ను కావాలనే ఆడిస్తున్నారా?

ABN , Publish Date - May 18 , 2026 | 02:53 AM

ఎడమకాలి గాయంతో బాధపడుతున్న కోల్‌కతా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ఆడిస్తుండడంపై బీసీసీఐ దృష్టి సారించింది...

వరుణ్‌ను కావాలనే ఆడిస్తున్నారా?

స్పిన్నర్‌ గాయంపై బీసీసీఐ దృష్టి

న్యూఢిల్లీ: ఎడమకాలి గాయంతో బాధపడుతున్న కోల్‌కతా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ఆడిస్తుండడంపై బీసీసీఐ దృష్టి సారించింది. శనివారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్‌ కుంటుతూనే బౌలింగ్‌ చేయడం కనిపించింది. ఈ మ్యాచ్‌లో గెలుపు ద్వారా ఆ జట్టు తమ ప్లేఆఫ్స్‌ బెర్త్‌ను సజీవంగా ఉంచుకుంది. అయితే వచ్చే నెలలో ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌లతో జరిగే 7 టీ20ల్లో వరుణ్‌ భారత్‌ తరఫున కీలకం కానున్నాడు. ఈ దశలో అతనికి తగిన విశ్రాంతి అవసరమనే భావనలో బోర్డు ఉంది. అతను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ప్లేయర్‌ కాబట్టి బీసీసీఐ వైద్య బృందం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందని ఓ అధికారి తెలిపాడు.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

సీఎస్కే-ఎస్ఆర్‌హెచ్: ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకనున్నాడా?

Updated Date - May 18 , 2026 | 02:53 AM