Share News

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

ABN , Publish Date - Mar 16 , 2026 | 02:39 AM

బీసీసీఐ నమన్‌ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి ఇక్కడ అత్యంత ఉల్లాస, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. దేశ క్రికెట్‌ సీనియర్‌, జూనియర్‌ పురుషులు, మహిళా జట్ల క్రికెటర్లు...

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

బీసీసీఐ అవార్డుల ప్రదానం

ఐసీసీ అధ్యక్షుడు జైషా నుంచి అవార్డులు అందుకుంటున్న

రోజర్‌ బిన్నీ, రాహుల్‌ ద్రవిడ్‌, మిథాలీ రాజ్‌

  • గిల్‌, మంధానకు ఉత్తమ క్రికెటర్ల పురస్కారాలు

  • బిన్నీ, ద్రవిడ్‌, మిథాలీకి జీవన సాఫల్య అవార్డులు

న్యూఢిల్లీ: బీసీసీఐ నమన్‌ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి ఇక్కడ అత్యంత ఉల్లాస, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. దేశ క్రికెట్‌ సీనియర్‌, జూనియర్‌ పురుషులు, మహిళా జట్ల క్రికెటర్లు, ఉద్దండులైన మాజీ ఆటగాళ్లు హాజరైన ఈ వేడుక..దేశ క్రికెట్‌ ప్రపంచాన్ని కళ్లకు కట్టింది. ఏడాది కాలంలో భారత పురుషులు, మహిళల సీనియర్‌, జూనియర్‌ జట్లు నాలుగు పరిమిత ఓవర్ల ప్రపంచ కప్‌లు గెలవడంతో ఈ కార్యక్రమం మరింత ప్రతిష్ఠాత్మకమైంది. 2024-25లో అద్భుత ప్రదర్శన చేసిన స్టార్‌ బ్యాటర్లు శుభ్‌మన్‌ గిల్‌, స్మృతీ మంధాన ‘పాలీ ఉమ్రిగర్‌’ అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్ల అవార్డులు అందుకున్నారు. గిల్‌కు ఈ పురస్కారం దక్కడం ఇది రెండోసారి. 2023లో అతడు ఈ అవార్డు పొందాడు. మంధానకు ఐదోసారి ఈ అవార్డు లభించడం విశేషం.

00-Sports.jpgగిల్‌, హర్మన్‌, సూర్య, ఆయుష్‌, నిక్కీ

భారత క్రికెట్‌కు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా రోజర్‌ బిన్నీ, రాహుల్‌ ద్రవిడ్‌, మిథాలీ రాజ్‌లకు బీసీసీఐ అత్యున్నత కల్నల్‌ సీకే నాయుడు జీవన సాఫల్య పురస్కారాలు ప్రదానం చేశారు. ఐసీసీ అధ్యక్షుడు జై షా అవార్డులు అందజేశారు. అంతేకాదు ఐదు ఐసీసీ ట్రోఫీలు (2025 చాంపియన్స్‌ ట్రోఫీ, 2025 మహిళల వన్డే వరల్డ్‌ కప్‌, 2025 అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌ కప్‌, 2026 అండర్‌-19 వన్డే వరల్డ్‌ కప్‌, 2026 పురుషుల టీ20 వరల్డ్‌ కప్‌) గెలిచిన జట్లను కూడా సన్మానించారు. వన్డే వరల్డ్‌ కప్‌ సాధించిన మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, టీ20 ప్రపంచ కప్‌ సొంతం చేసుకున్న పురుషుల జట్టు సారథి సూర్యకుమార్‌, చాంపియన్స్‌ ట్రోఫీ నెగ్గిన పురుషుల జట్టు కెప్టెన్‌ గిల్‌, అండర్‌-19 వన్డే వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన జట్టు కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే, అండర్‌-19 టీ20 ప్రపంచ కప్‌ చాంపియన్‌ మహిళల జట్టు సారథి నిక్కీ ప్రసాద్‌లతో నిర్వహించిన చర్చా వేదిక కార్యక్రమానికి హైలైట్‌ అయ్యింది.

0-Sports.jpgజెమీమా, అరుంధతి, స్మృతి మంధాన

ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ

ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Mar 16 , 2026 | 02:39 AM