అక్టోబరు 11 నుంచి రంజీలు
ABN , Publish Date - May 21 , 2026 | 01:24 AM
దేశవాళీ క్రికెట్ క్యాలెండర్ 2026-27 షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ సీజన్‌లో పురుషులు, మహిళలు, వివిధ వయో...
బీసీసీఐ దేశవాళీ క్యాలెండర్ విడుదల
న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్ క్యాలెండర్ 2026-27 షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ సీజన్‌లో పురుషులు, మహిళలు, వివిధ వయో విభాగాలకు సంబంధించి మొత్తం 1788 మ్యాచ్‌లను బోర్డు నిర్వహించనుంది. ఆగస్టు 23 నుంచి దులీప్ ట్రోఫీ, అక్టోబరు ఒకటినుంచి ఇరానీ ట్రోఫీ జరుగనుంది. మరో వారం తర్వాత తొలి దశ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను అక్టోబరు 11 నుంచి నవంబరు 5 వరకు, రెండో దశను జనవరి 17 నుంచి మార్చి 3 వరకు నిర్వహించనున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని నవంబరు 14 నుంచి జరపనున్నారు. దేశవాళీ వన్డే ట్రోఫీ విజయ్ హజారే డిసెంబరు 14 నుంచి జరుగుతుంది.
ఇవి కూడా చదవండి:
భారత టీ20 జట్టుకు శ్రేయస్ కెప్టెన్ అవుతాడు: రికీ పాంటింగ్
లార్డ్స్ మైదానంలో తొలి టీ20 ప్రపంచ కప్ గెలుస్తాం: జెమీమా