Share News

బంగ్లాదేశ్‌ క్లీన్‌స్వీ్‌ప

ABN , Publish Date - May 21 , 2026 | 01:26 AM

పాకిస్థాన్‌తో రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ 78 పరుగులతో విజయం సాధించి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. అలాగే బంగ్లాదేశ్‌ టెస్ట్‌ చరిత్రలో...

బంగ్లాదేశ్‌ క్లీన్‌స్వీ్‌ప

రెండో టెస్ట్‌లోనూ పాక్‌ చిత్తు

సిల్హెట్‌ (బంగ్లాదేశ్‌): పాకిస్థాన్‌తో రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ 78 పరుగులతో విజయం సాధించి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. అలాగే బంగ్లాదేశ్‌ టెస్ట్‌ చరిత్రలో వరుసగా నాలుగు టెస్టులు నెగ్గడం కూడా ఇదే తొలిసారి. గత ఏడాది ఐర్లాండ్‌ను 2-0తో ఓడించింది. 437 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 316/7తో బుఽధవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్థాన్‌ 358 రన్స్‌కు ఆలౌటైంది. కిందటి రోజు బ్యాటర్లు రిజ్వాన్‌ (94), సాజిద్‌ ఖాన్‌ (28) ఆఖరి రోజు ఉదయం గంటపాటు బంగ్లా బౌలర్లను నిలువరించారు. ఇక..బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 278, రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసింది. పాకిస్థాన్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 232 రన్స్‌ సాధించింది.

ఇవి కూడా చదవండి:

భారత టీ20 జట్టుకు శ్రేయస్ కెప్టెన్ అవుతాడు: రికీ పాంటింగ్

లార్డ్స్‌ మైదానంలో తొలి టీ20 ప్రపంచ కప్ గెలుస్తాం: జెమీమా

Updated Date - May 21 , 2026 | 01:26 AM