Share News

పాక్‌కు నహీద్‌ ‘పంచ్‌’

ABN , Publish Date - May 13 , 2026 | 01:43 AM

పేసర్‌ నహీద్‌ రాణా (5/40) నిప్పులు చెరగడంతో.. పాకిస్థాన్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ 104 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆటకు ఆఖరి, ఐదో రోజు బంగ్లా నిర్దేశించిన...

పాక్‌కు నహీద్‌ ‘పంచ్‌’

తొలి టెస్ట్‌లో బంగ్లా గెలుపు

ఢాకా: పేసర్‌ నహీద్‌ రాణా (5/40) నిప్పులు చెరగడంతో.. పాకిస్థాన్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ 104 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆటకు ఆఖరి, ఐదో రోజు బంగ్లా నిర్దేశించిన 268 పరుగుల లక్ష్య ఛేదనలో.. రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ 163 పరుగులకే కుప్పకూలింది. అబ్దుల్లా ఫజల్‌ (66) రాణించాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 152/3తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లా 240/9 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ నజ్ముల్‌ (87) హాఫ్‌ సెంచరీ చేశాడు. హసన్‌, నోమన్‌ అలీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అయితే, కెరీర్‌లో 100వ వికెట్‌ మైలురాయిని చేరిన నోమన్‌ (39 ఏళ్ల 217 రోజులు).. ఈ ఫీట్‌ సాధించిన పెద్ద వయసు ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. 130 ఏళ్ల క్రితం 1896లో ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ బాబీ పీల్‌ (39 ఏళ్ల 180 రోజులు) రికార్డును అతడు అధిగమించాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 413 పరుగులు చేయగా.. పాకిస్థాన్‌ 386 పరుగులకు ఆలౌటైంది.

ఇవి కూడా చదవండి:

నేను స్వయంగా రిటైర్ అవ్వాలనేదే వారి కోరిక: వినేశ్ ఫొగాట్

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా

Updated Date - May 13 , 2026 | 01:43 AM