ఐపీఎల్ నుంచి మాత్రే అవుట్!
ABN , Publish Date - Apr 20 , 2026 | 01:26 AM
ఈ సీజన్‌లో నిరాశపరుస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో నిలకడగా రాణిస్తున్న యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే...
హైదరాబాద్: ఈ సీజన్‌లో నిరాశపరుస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో నిలకడగా రాణిస్తున్న యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే లీగ్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. శనివారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అతను తొడకండరాల నొప్పితో బాధపడ్డాడు. జోరుగా బ్యాటింగ్ చేసిన మాత్రే రెండో సింగిల్‌కు వెళ్లే క్రమంలో ఎడమ కాలి కండరాలు పట్టేశాయి. అవుటయ్యాక అతడిని సహాయక బృందం డగౌట్‌కు తీసుకెళ్లాల్సి వచ్చింది. మాత్రే గాయం తీవ్రత అధికంగానే ఉందని జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ తెలిపాడు. స్కానింగ్ చేశాక అతను ఎన్ని రోజులు దూరమవుతాడనే విషయం తేలుతుందన్నాడు. అతడి స్థానంలో ఉర్విల్ పటేల్ ఆడే చాన్సుంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ఎట్టకేలకు.. తొలి విజయాన్ని నమోదు చేసిన కేకేఆర్
ఐపీఎల్ 2026: ఆర్ఆర్‌పై చెలరేగిన బౌలర్లు.. కేకేఆర్ టార్గెట్ 156