ఐపీఎల్ వైపే మొగ్గు
ABN , Publish Date - May 08 , 2026 | 02:11 AM
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం ఈనెల 30 నుంచి జూన్ 4 వరకు పాకిస్థాన్‌లో పర్యటించనుంది. అయితే అదే సమయంలో...
పాక్ టూర్‌కు ఆసీస్ స్టార్ ఆటగాళ్లు దూరం
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం ఈనెల 30 నుంచి జూన్ 4 వరకు పాకిస్థాన్‌లో పర్యటించనుంది. అయితే అదే సమయంలో ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఉండడంతో కెప్టెన్ కమిన్స్ (సన్‌రైజర్స్)తో పాటు పేసర్లు హాజెల్‌వుడ్ (ఆర్‌సీబీ), మిచెల్ స్టార్క్ (ఢిల్లీ) భారత్‌లోనే ఉండే అవకాశం ఉంది. లీగ్ మ్యాచ్‌లు ఈనెల 24తో ముగిసి 31న ఫైనల్ ఉంటుంది. రైజర్స్, బెంగళూరు, ఢిల్లీ ప్లేఆఫ్స్ పోటీలో ఉండడం తెలిసిందే. అలాగే పంజాబ్‌లో ముగ్గురు, చెన్నైలో మరో ఆసీస్ ఆటగాడు ఉన్నాడు. అయితే పాక్‌లో ఆసీస్ జట్టు ఈనెల 23న అడుగుపెట్టనుండడంతో, జట్టు సన్నాహకాలతో పాటు కనీసం తొలి మ్యాచ్‌కు పలువురు దూరమయ్యే అవకాశముంది. ఇక ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోలేకపోయిన ఇతర జట్లలోని ఆసీస్ ఆటగాళ్లు మాత్రం పాక్‌కు వెళ్లే చాన్సుంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక పదవికి రాజీనామా