Share News

409 పరుగుల భారీ స్కోరు ఆసీస్ అదుర్

ABN , Publish Date - Mar 02 , 2026 | 04:51 AM

కెరీర్‌ ఆఖరి వన్డేలో అలీసా హీలీ (158) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడగా, బేత్‌ మూనీ (106 నాటౌట్‌) అజేయ సెంచరీతో అదరగొట్టిన వేళ..భారత్‌తో వన్డే సిరీ్‌సను ఆస్ట్రేలియా మహిళలు క్లీన్‌స్వీ్‌ప చేశారు. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో...

409 పరుగుల భారీ స్కోరు ఆసీస్ అదుర్

మూడో వన్డేలోనూ భారత్‌ ఓటమి

వీడ్కోలు మ్యాచ్‌లో

కదం తొక్కిన హీలీ

హోబర్ట్‌: కెరీర్‌ ఆఖరి వన్డేలో అలీసా హీలీ (158) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడగా, బేత్‌ మూనీ (106 నాటౌట్‌) అజేయ సెంచరీతో అదరగొట్టిన వేళ..భారత్‌తో వన్డే సిరీ్‌సను ఆస్ట్రేలియా మహిళలు క్లీన్‌స్వీ్‌ప చేశారు. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో కంగారూలు 185 పరుగులతో వరల్డ్‌ చాంపియన్‌ భారత్‌ను చిత్తు చేశారు. అంతేకాదు..ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ మిగిలుండగానే ఈ మల్టీ ఫార్మాట్‌ సిరీ్‌సలో 8-4తో ట్రోఫీని నిలబెట్టుకున్నారు. 2021లో చివరిసారి మల్టీఫార్మాట్‌ సిరీ్‌సనూ ఆసీస్‌ మహిళలు సొంతం చేసుకున్నారు. ఇక..మ్యాచ్‌లో మొదట ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 409/7 స్కోరు చేసింది. హీలీ, మూనీకి తోడు జార్జియా వాల్‌ (62) సత్తా చాటింది. వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు 104 పరుగులు జోడించిన హీలీ..మూనీతో కలిసి మూడో వికెట్‌కు 145 (92 బంతులు) రన్స్‌ జత చేసింది. భారీ ఛేదనలో భారత్‌ 45.1 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. స్నేహ్‌ రాణా (44), జెమీమా (42) కూడా విఫలమైతే మనోళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. అలనా కింగ్‌ నాలుగు, వార్హెమ్‌ రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో గత వన్డే వరల్డ్‌ కప్‌ సెమీ్‌సలో హర్మన్‌ప్రీత్‌ సేన చేతిలో ఓటమికి ఆస్ట్రేలియా బదులు తీర్చుకుంది. హీలీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది. కాగా వన్డేల్లో అత్యధిక స్కోరు న్యూజిలాండ్‌ (2018లో 491/4) పేరిట ఉంది.

సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా: 50 ఓవర్లలో 409/7 (హీలీ 158, మూనీ 106 నాటౌట్‌, వాల్‌ 62, నికోలా కేరీ 34 నాటౌట్‌, స్నేహ్‌ రాణా 2/66, శ్రీచరణి 2/106).

భారత్‌: 45.1 ఓవర్లలో 224 ఆలౌట్‌ (స్నేహ్‌ రాణా 44, జెమీమా 42, దీప్తీశర్మ 29, ప్రతిక 27, హర్మన్‌ 25, అలనా కింగ్‌ 4/33, జార్జియా వార్హెమ్‌ 2/3).

శ్రీచరణి చెత్త రికార్డు

10-0-106-2.. మ్యాచ్‌లో స్పిన్నర్‌ శ్రీచరణి గణాంకాలు. దాంతో వన్డేల్లో అత్యధిక రన్స్‌ ఇచ్చిన భారత స్పిన్నర్‌గా ఆమె నిలిచింది. ఈక్రమంలో చాహల్‌ (10-0-89-1) రికార్డు ను తిరగ రాసింది. అంతేకాదు ఒక ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగులిచ్చిన తొలి భా రత స్పిన్నర్‌గా శీచరణి మరో రికార్డు నమో దు చేసింది. అలాగే..వన్డేలలో అత్యధిక పరుగులిచ్చిన భారత్‌ బౌలర్‌గా భువనేశ్వర్‌ (10-0-106-1) రికార్డును సమం చేసింది.

1

409/7 .. ఆస్ట్రేలియా గడ్డపై మహిళల వన్డేలలో ఇదే అత్యధిక స్కోరు. అలాగే భారత జట్టుపై ఏ దేశంలోనైనా ఇదే అత్యధిక స్కోరు.

1

కెరీర్‌ ఆఖరి వన్డేలో సెంచరీ చేసిన లోగ్టెన్‌బర్గ్‌ (దక్షిణాఫ్రికా)తో సమంగా నిలిచిన అలీసా హీలీ.

ఇవి కూడా చదవండి

చేరుకునే దారి లేకే చేజారిన ప్రాణాలు

ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం

Updated Date - Mar 02 , 2026 | 04:52 AM