పాక్‌లో జాగ్రత్త..
ABN , Publish Date - Mar 18 , 2026 | 02:33 AM
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎ్‌సఎల్)లో బరిలోకి దిగే తమ దేశ క్రికెటర్లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈనెల 26 నుంచి ఆరంభం కానున్న...
ఆసీస్ క్రికెటర్లకు సూచన
మెల్‌బోర్న్: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎ్‌సఎల్)లో బరిలోకి దిగే తమ దేశ క్రికెటర్లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈనెల 26 నుంచి ఆరంభం కానున్న ఈ లీగ్‌లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, లబుషేన్, మెక్‌గుర్క్, మ్యాక్స్‌వెల్ ఆడే అవకాశం ఉంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధ భయానికి తోడు తాజాగా అఫ్ఘాన్-పాక్ సరిహద్దులోనూ ఉద్రిక్తత నెలకొనడంతో వారిపై ఆసీస్ ప్రయాణ ఆంక్షలను విధించింది. ముఖ్యంగా పెషావర్‌లో జరిగే మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని సూచించింది. అటు అవసరమైతే ఆసీస్ ప్లేయర్లను చార్టర్ ఫ్లైట్స్ ద్వారా తరలిస్తామని లీగ్ నిర్వాహకులు భరోసానిచ్చారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో ఇంకా కలగానే ఆ ఆటగాళ్ల కోరిక!
NZ vs SA: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం