ఆసీస్.. అదే తడబాటు
ABN , Publish Date - Aug 16 , 2026 | 05:50 AM
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఆధిపత్యం చూపుతోంది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఈ జట్టు బౌలింగ్‌లోనూ...
రెండో ఇన్నింగ్స్ 161/4
బంగ్లా తొలి ఇన్నింగ్స్ 426
మొదటి టెస్టు
డార్విన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఆధిపత్యం చూపుతోంది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఈ జట్టు బౌలింగ్‌లోనూ చెలరేగుతోంది. ఫలితంగా ఆసీస్ మూడో రోజు శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. స్మిత్ (44), గ్రీన్ (43 బ్యాటింగ్), లబుషేన్ (31) ఫర్వాలేదనిపించారు. మెహదీ హసన్‌కు రెండు వికెట్లు దక్కాయి. గ్రీన్‌కు జతగా క్యారీ (19) క్రీజులో ఉండగా.. ఆసీస్ ఇంకా 67 పరుగులు వెనుకంజలో ఉంది. అంతకుముందు బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులు చేసింది. మెహెదీ హసన్ (65) అర్ధసెంచరీ చేశాడు. హాజెల్‌వుడ్‌కు ఆరు, స్టార్క్‌కు రెండు వికెట్లు లభించాయి. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది.
ఇవి కూడా చదవండి..
బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థల లింకులతో దర్యాప్తు..
అరుణాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. నలుగురి మృతి, ఆర్మీ సిబ్బంది గల్లంతు..