Share News

స్వర్ణంపైనే గురి

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:39 AM

ఆసియాగేమ్స్‌లో మహిళల క్రికెట్‌ ముగింపు దశకు చేరుకుంది. మంగళవారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు శ్రీలంకతో...

స్వర్ణంపైనే గురి

ఉ.10.30 నుంచి

సోనీ స్పోర్ట్స్‌లో..

శ్రీలంకతో ఫైనల్‌ నేడు

జోష్‌లో భారత మహిళల జట్టు

నిస్సిన్‌: ఆసియాగేమ్స్‌లో మహిళల క్రికెట్‌ ముగింపు దశకు చేరుకుంది. మంగళవారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు శ్రీలంకతో తలపడనుంది. ఇటీవలే ముగిసిన ఆసియాకప్‌ తుది పోరులోనూ ఈ రెండు జట్లే తలపడిన విష యం తెలిసిందే. అందులో విజేతగా నిలిచిన హర్మన్‌ప్రీత్‌ సేన ఆత్మవిశ్వాసంతో ఉంది. అజేయ ఆటతీరుతో దూసుకెళ్తున్న వేళ.. లంకపై మరో విజయంతో స్వర్ణం అందుకోవాలనే ఆలోచనలో ఉంది. ఓపెనర్‌ షఫాలీ వర్మ భీకరఫామ్‌లో ఉండడం సానుకూలాంశం కానుంది. అలాగే మంధాన, హర్మన్‌, రిచా బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయమే. ఇక బౌలింగ్‌లో పేసర్లు నందని, క్రాంతిలతో పాటు స్పి న్నర్లు దీప్తి, శ్రీచరణి, షఫాలీ హడలెత్తిస్తున్నారు. అటు లంక జట్టు తమ కెప్టెన్‌ చమరి ఆటపట్టుపై ఎక్కువగా ఆధారపడి ఉంది.

ఇవి కూడా చదవండి:

ఆసియా గేమ్స్: కుమారుడి టీమ్ ఓటమి.. మాధవన్ రియాక్షన్ ఇదే!

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. రిజర్వ్ ఓపెనర్ రేసులో సాయి సుదర్శన్

Updated Date - Sep 22 , 2026 | 05:39 AM