ఒక్క బంతీ పడకుండానే..
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:42 AM
ఊహించినట్టుగానే ఆసియాగేమ్స్ క్రికెట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో సోమవారం భారత్-అఫ్ఘాన్ జట్ల మధ్య జరగాల్సిన టీ20 మ్యాచ్‌లో...
పురుషుల క్రికెట్ సెమీస్‌లో భారత్
అఫ్ఘాన్‌తో మ్యాచ్ వర్షంతో రద్దు
నిస్సిన్: ఊహించినట్టుగానే ఆసియాగేమ్స్ క్రికెట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో సోమవారం భారత్-అఫ్ఘాన్ జట్ల మధ్య జరగాల్సిన టీ20 మ్యాచ్‌లో కనీసం టాస్ కూడా వీలుపడలేదు. అయితే మెరుగైన ర్యాంకింగ్ కారణంగా భారత్ సెమీస్‌లో అడుగుపెట్టింది. వరల్డ్ చాంపియన్ టీమిండియా అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌గా ఉండగా, అఫ్ఘాన్ పదో స్థానంలో కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఇక్కడ నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచే కురిసిన వర్షానికి మైదానం ఆటకు వీలు లేకుండా చిత్తడిగా మారింది. దీంతో ఎలాంటి ఎదురుచూపులకు తావు లేకుండా అంపైర్లు మ్యాచ్ రద్దయినట్టు ప్రకటించారు. ఇక మంగళవారం శ్రీలంక-నేపాల్ జట్ల మధ్య జరిగే క్వార్టర్స్ విజేతతో టీమిండియా సెమీ్‌సలో తలపడుతుంది. ఒకవేళ నేటి క్వార్టర్స్ కూడా రద్దయితే నేపాల్‌కన్నా ఉత్తమ ర్యాంకింగ్‌లో ఉన్న లంక ముందుకు వెళ్తుంది. మరోవైపు భారత్ మ్యాచ్ కన్నా ముందు ఇదే మైదానంలో పాకిస్థాన్-హాంకాంగ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి క్వార్టర్స్ మ్యాచ్ కూడా ఒక్క బంతి పడకుండానే రద్దయ్యింది. దీంతో పాక్ సెమీస్‌కు వెళ్లింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్..