అందుకే తప్పుకొన్నా..
ABN , Publish Date - Apr 07 , 2026 | 02:34 AM
గతేడాది పేలవ ప్రదర్శన కారణంగానే ఐపీఎల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని మాజీ స్పిన్నర్ ఆర్.అశ్విన్ తెలిపాడు. ‘వాస్తవానికి ఐపీఎల్‌లో మరికొంతకాలం....
ఐపీఎల్‌పై అశ్విన్
చెన్నై: గతేడాది పేలవ ప్రదర్శన కారణంగానే ఐపీఎల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని మాజీ స్పిన్నర్ ఆర్.అశ్విన్ తెలిపాడు. ‘వాస్తవానికి ఐపీఎల్‌లో మరికొంతకాలం కొనసాగాలనుకున్నా. కానీ సీఎ్‌సకే తరఫున గత సీజన్‌లో రాణించలేకపోయా. మానసికంగా చాలా ఇబ్బందిపడ్డా. ఎక్కడైతే లీగ్‌ను ఆరంభించానో అక్కడే ముగించాలనిపించింది. అదీగాకుండా నన్ను రిటైన్ చేసుకోవాలా? లేక వదిలేయాలా? అనే తలనొప్పి మేనేజ్‌మెంట్‌కు ఉండకూడదని భావించా. నా ధరతో వేలంలో మెరుగైన యువ ఆటగాళ్లను తీసుకోవచ్చు. అందుకే ఐపీఎల్‌కు ముగింపు పలికా’ అని అశ్విన్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
అందుకే ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ధోనికి ఫిట్‌నెస్ టెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్న తలా!