Share News

ఓయ్‌..నల్లోడా!

ABN , Publish Date - May 16 , 2026 | 02:53 AM

పంజాబ్‌ కింగ్స్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ వివాదంలో చిక్కుకున్నాడు. ముంబై బ్యాటర్‌ తిలక్‌వర్మ నుద్దేశించి అతడు ‘ఓయ్‌..అంధేరే (నల్లోడా).. సన్‌స్ర్కీన్‌ రాసుకోలేదా’ అని అర్ష్‌దీప్‌ చేసిన...

ఓయ్‌..నల్లోడా!

  • తిలక్‌పై అర్ష్‌దీప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

  • పంజాబ్‌ పేసర్‌పై విమర్శల వెల్లువ

ధర్మశాల: పంజాబ్‌ కింగ్స్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ వివాదంలో చిక్కుకున్నాడు. ముంబై బ్యాటర్‌ తిలక్‌వర్మ నుద్దేశించి అతడు ‘ఓయ్‌..అంధేరే (నల్లోడా).. సన్‌స్ర్కీన్‌ రాసుకోలేదా’ అని అర్ష్‌దీప్‌ చేసిన వీడియోలో వ్యాఖ్యానించాడు. అంతటితో ఆగకుండా..కెమెరాను నమన్‌వైపు తిప్పడంతోపాటు ‘అతడు పంజాబ్‌ నుంచి వచ్చిన అసలైన నూర్‌ (నూర్‌ అంటే తేజస్సు)’ అని అనడం కనిపించింది. అంతేకాదు.. ఈ వీడియోను అర్ష్‌దీప్‌ స్నాప్‌చాట్‌లో అప్‌లోడ్‌ చేశాడు. దానిని తిలకించిన నెటిజన్లు అర్ష్‌దీ్‌పవి జాత్యాహంకార వ్యాఖ్యలుగా దుయ్యబడుతున్నారు.

ముంబై ఇండియన్స్‌ కౌంటర్‌: అర్ష్‌దీప్‌ వ్యాఖ్యలకు ముంబై ఇండియన్స్‌ దీటుగా బదులిచ్చింది. ఆ అవార్డుతో ఉన్న ఫొటోకు సంబంధించిన వీడియోను ముంబై సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. చీకటి దృశ్యంతో ఆ వీడియో ప్రారంభమవుతుంది. అనంతరం తిలక్‌ వర్మ కనిపిస్తాడు. ఆ క్రమంలో బాలీవుడ్‌ సినిమాలోని ఓ పాటను ఆ వీడియోకు జత చేసింది. ‘నీ చీకటిని తీసుకొని నా మెరిసే నక్షత్రాన్ని నీకు ఇచ్చాను’ అనే భావంతో కూడిన ఆ పాటతో అర్ష్‌దీప్‌ వ్యాఖ్యలకు ముంబై కౌంటర్‌ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

ప్లే ఆఫ్స్‌కు ముందు కేకేఆర్‌కు షాక్.. ఐపీఎల్‌ను వీడిన రచిన్ రవీంద్ర

కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి

Updated Date - May 16 , 2026 | 02:53 AM