Share News

నబీ.. తొలి మూడు వన్డేలకు కూడా

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:46 AM

న్యూజిలాండ్‌తో జరిగే తొలి మూడు వన్డేలకు కూడా పేసర్‌ అకీబ్‌ నబీని బీసీసీఐ ఎంపిక చేసింది...

నబీ.. తొలి మూడు వన్డేలకు కూడా

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరిగే తొలి మూడు వన్డేలకు కూడా పేసర్‌ అకీబ్‌ నబీని బీసీసీఐ ఎంపిక చేసింది. పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ గాయంతో దూరం కాగా అతడి స్థానంలో ఈ కశ్మీరీ పేసర్‌ను తీసుకున్నారు. ఈనెల 4 నుంచి జరిగే ఈ సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు మాత్రమే నబీని తొలుత ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నబీ భారత్‌ ‘ఎ’ మ్యాచ్‌ తరఫున కివీస్‌లోనే పర్యటిస్తున్నాడు. సెప్టెంబరులో విండీస్‌తో జరిగిన గువాహటి వన్డేలో నబీ అరంగేట్రం చేశాడు.

ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య

పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!

Updated Date - Nov 01 , 2026 | 03:46 AM