Share News

అకీబ్‌ నబీకి ‘తొలి’ పిలుపు

ABN , Publish Date - Aug 04 , 2026 | 04:44 AM

జమ్మూ కశ్మీర్‌ పేసర్‌ అకీబ్‌ నబీకి భారత జట్టులో తొలిసారి చోటు దక్కింది. శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీ్‌సకు బుమ్రా స్థానంలో అతడికి స్థానం...

అకీబ్‌ నబీకి ‘తొలి’ పిలుపు

బుమ్రా స్థానంలో చోటు

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ పేసర్‌ అకీబ్‌ నబీకి భారత జట్టులో తొలిసారి చోటు దక్కింది. శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీ్‌సకు బుమ్రా స్థానంలో అతడికి స్థానం కల్పించినట్టు బీసీసీఐ సోమవారం వెల్లడించింది. మోకాలి గాయంతో శ్రీలంక టూర్‌కు బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే. కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన 29 ఏళ్ల నబీ గత రెండు రంజీ సీజన్లలో కలిపి 104 వికెట్లతో సత్తా చాటాడు. ఇక..గత సీజన్‌లో 60 వికెట్లు సాధించిన అతడు జమ్మూ కశ్మీర్‌ జట్టు మొదటిసారి రంజీట్రోఫీని అందుకోవడంలో కీలక భూమిక పోషించాడు. బ్యాటుతో కూడా రాణించగల సామర్థ్యం నబీ సొంతం. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన భారత్‌ ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సిరీ్‌సలో జరిగిన రెండు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో అకీబ్‌ ఆరు వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి:

నీరజ్ చోప్రా సలహాతోనే మెడల్ వరించింది: కాంస్య విజేత యశ్‌వీర్ సింగ్

టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ

Updated Date - Aug 04 , 2026 | 04:44 AM