Share News

అన్వయ్‌ ద్రవిడ్‌ మెరుపులు వృథా

ABN , Publish Date - Jul 07 , 2026 | 02:57 AM

మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కుమారుడు అన్వయ్‌ ద్రవిడ్‌ (67 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 87) అదరగొట్టినా....

అన్వయ్‌ ద్రవిడ్‌ మెరుపులు వృథా

యూత్‌ వన్డేలో భారత్‌పై శ్రీలంక విజయం

హంబన్‌టోటా: మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కుమారుడు అన్వయ్‌ ద్రవిడ్‌ (67 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 87) అదరగొట్టినా.. శ్రీలంక అండర్‌-19 జట్టుతో సోమవారం జరిగిన రెండో యూత్‌ వన్డేలో భారత కుర్రాళ్లు 8 వికెట్ల తేడాతో ఓడారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 47.2 ఓవర్లలో 285 పరుగులు చేసింది. 81/4 స్కోరుతో కష్టాల్లో పడిన జట్టును 17 ఏళ్ల అన్వయ్‌ ఆదుకున్నాడు. అర్జున్‌ రాజ్‌పుత్‌ (76)తో కలిసి ఐదో వికెట్‌కు 145 పరుగులు అందించాడు. ఆ తర్వాత ఛేదనలో శ్రీలంక కుర్రాళ్లు 48 ఓవర్లలో 291/2 స్కోరుతో గెలిచారు. మహావిథన (155 నాటౌట్‌) సెంచరీతో చెలరేగాడు.

ఇవి కూడా చదవండి:

వైభవ్ అరంగేట్రంలో జాప్యంపై స్పందించిన బీసీసీఐ

ట్రంప్‌ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం తీవ్ర విమర్శలు

Updated Date - Jul 07 , 2026 | 02:57 AM