Share News

అమరావతికి మరో గెలుపు

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:32 AM

మహిళల ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌లో అమరావతి ఈ చాంపియన్స్‌ వరుసగా రెండో విజయం సాధించింది...

అమరావతికి మరో గెలుపు

మంగళగిరి సిటీ (ఆంధ్రజ్యోతి): మహిళల ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌లో అమరావతి ఈ చాంపియన్స్‌ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో అమరావతి 7 వికెట్లతో రాయలసీమ జెన్‌ స్టార్స్‌ను ఓడించింది. తొలుత అమరావతి 20 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసింది. రంగలక్ష్మి (50), దీక్ష (48), అనూష (46) రాణించారు. ఛేదనలో రాయలసీమ 20 ఓవర్లలో 156/9 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. గ్రీష్మ (39) టాప్‌ స్కోరర్‌. సాయి పూజిత 4, దేవిక 2 వికెట్లు తీశారు. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో గోదావరి గోల్డెన్‌ ఈగల్స్‌ 10 పరుగుల తేడాతో వైజాగ్‌ ఫైర్‌బర్డ్స్‌పై గెలిచింది. మొదట బరిలోకి దిగిన గోదావరి.. పెరీరా (61 నాటౌట్‌) సత్తా చాటడంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 134 పరుగులు చేసింది. ఛేదనలో వైజాగ్‌ జట్టు 20 ఓవర్లలో 124/6 స్కోరు మాత్రమే చేసి ఓడింది.

ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: డబుల్ సిల్వర్.. భారత షూటర్లను అభినందించిన ప్రధాని మోదీ

న్యూజిలాండ్ టూర్: టీమిండియాకు కొత్త చిక్కులు.. కీలక ప్లేయర్లకు విశ్రాంతి?

Updated Date - Sep 21 , 2026 | 05:32 AM