కౌంటీ క్రికెట్‌లో అకీబ్ నబీ!
ABN , Publish Date - Aug 29 , 2026 | 03:18 AM
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీ్‌సకు ముందు పేసర్ అకీబ్ నబీకి మరింత మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తే బావుంటుందని బీసీసీఐ భావిస్తోంది...
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీ్‌సకు ముందు పేసర్ అకీబ్ నబీకి మరింత మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తే బావుంటుందని బీసీసీఐ భావిస్తోంది. ఇటీవలి శ్రీలంక పర్యటనలో నబీతో పాటు గుర్నూర్ బ్రార్‌కు తుది జట్టులో అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో బ్రార్‌ను దులీప్ ట్రోఫీ ఫైనల్లో నార్త్ జోన్ తరఫున ఆడించనున్నారు. ఇక నబీని కౌంటీలకు పంపే ఆలోచనల్లో ఉండగా, స్వల్పకాలిక ఒప్పందం కోసం ఇప్పటికే పలు క్లబ్బులను బోర్డు సంప్రదిస్తోంది. మరోవైపు సర్రే కౌంటీకి ఓ పేసర్ అవసరం ఉండడంతో.. నబీ ఆ జట్టు తరఫున ఆడే అవకాశం ఉంది. చివరి రంజీ సీజన్‌లో నబీ అత్యధికంగా 60 వికెట్లు సాధించడం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
టెస్టు క్రికెట్‌కు అవే ముఖ్యం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ స్పందనిదే!
అనయ బంగర్‌ను ఆడించొద్దు.. సౌతాఫ్రికా క్రికెటర్ కాప్ తీవ్ర విమర్శలు