Share News

అగార్కర్‌ వైదొలగక తప్పదా?

ABN , Publish Date - Aug 06 , 2026 | 04:09 AM

జాతీయ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌పై ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తోంది. వచ్చేనెలలో చీఫ్‌ సెలెక్టర్‌గా అతడి పదవీ కాలం ముగుస్తోంది...

అగార్కర్‌ వైదొలగక తప్పదా?

చీఫ్‌ సెలెక్టర్‌ రేస్‌లో లక్ష్మణ్‌!

జాతీయ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌పై ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తోంది. వచ్చేనెలలో చీఫ్‌ సెలెక్టర్‌గా అతడి పదవీ కాలం ముగుస్తోంది. వాస్తవంగా అగార్కర్‌ పదవీకాలం గత జూన్‌లోనే ముగిసింది. కానీ బీసీసీఐ అతడికి మూడు నెలలు పొడిగింపు ఇచ్చింది. పరిస్థితులన్నీ సాఽధారణంగా ఉంటే వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌ వరకూ అజిత్‌ కొనసాగేవాడే. కానీ సీనియర్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ వన్డేల నుంచి రిటైర్మెంట్‌ విషయమై ఇటీవల జరిగిన వివాదం అగార్కర్‌ పదవి పొడిగింపుపై బీసీసీఐని పునరాలోచనలో పడేసినట్టు సమాచారం. ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన వన్డేనే హిట్‌మ్యాన్‌కి చివరిదని, అనంతరం అతడు 50 ఓవర్ల ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలకనున్నాడని పుంఖాను పుంఖాలుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన రోహిత్‌ తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు గట్టిగా బదులిచ్చాడు. మొత్తంగా..రోహిత్‌ రిటైర్మెంట్‌ వివాదం ఆసాంతం అగార్కర్‌ చుట్టూనే తిరగడం గమనార్హం.

9-Sports.jpg

తెరపైకి లక్ష్మణ్‌ పేరు: అగార్కర్‌కు మరోసారి పొడిగింపులేదనే వార్తల నేపథ్యంలో..మరి చీఫ్‌ సెలెక్టర్‌గా ఎవరనే అంశంపైౖ చర్చ బయలుదేరింది. బెంగళూరులోని సెంటరాఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఏ) హెడ్‌గా ఉన్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేరు బలంగా వినిపిస్తోంది. లక్ష్మణ్‌ ఎంపికే ఉత్తమంగా ఉంటుందని బీసీసీఐ పెద్దలు కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీవీఎస్‌ అభిప్రాయాలను, సలహాలను సీనియర్లు రోహిత్‌, విరాట్‌ గౌరవిస్తారన్నది బోర్డు పెద్దల అభిప్రాయమట. మొత్తంగా..చీఫ్‌ సెలెక్టర్‌ విషయమై వచ్చేనెలలో జరిగే బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశంలో బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఇక భారత జట్టుకు సంబంధించి లక్ష్మణ్‌ పేరు వినిపించడం ఇది తొలిసారేం కాదు. 2024లో ద్రవిడ్‌ హెడ్‌ కోచ్‌గా వైదొలిగాక..ఆ పదవికి లక్ష్మణ్‌ పేరు ప్రముఖంగా వినిపించింది.

ఇవి కూడా చదవండి:

సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. గంభీర్‌కు పరోక్షంగా సందేశం ఇచ్చిన రహానే

ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ

Updated Date - Aug 06 , 2026 | 04:10 AM