అభిషేక్ 1.. ఇషాన్ 2
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:37 AM
టీ20 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన ఓపెనర్ ఇషాన్ కిషన్ బుధవారం ప్రకటించిన ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లో అత్యుత్తమంగా రెండో స్థానానికి దూసుకొచ్చాడు. మరోవైపు అభిషేక్ శర్మ టాప్ ర్యాంకును...
టీ20 ర్యాంకింగ్స్
దుబాయ్: టీ20 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన ఓపెనర్ ఇషాన్ కిషన్ బుధవారం ప్రకటించిన ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లో అత్యుత్తమంగా రెండో స్థానానికి దూసుకొచ్చాడు. మరోవైపు అభిషేక్ శర్మ టాప్ ర్యాంకును పదిలం చేసుకొన్నాడు. దాంతో టీ20 ర్యాంకింగ్స్ చరిత్రలో తొలిసారి ఇద్దరు భారత క్రికెటర్లు తొలి రెండు ర్యాంకుల్లో నిలిచారు. అయితే ఇషాన్ (871 పాయింట్లు)కు అభిషేక్ (875 పాయింట్లు)కు నాలుగు పాయింట్ల అంతరమే ఉంది. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి (740) తన టాప్ ర్యాంకును అఫ్ఘానిస్థాన్‌కు చెందిన రషీద్ (753)కు కోల్పోయాడు. వరుణ్ రెండో ర్యాంకుకు పరిమితమయ్యాడు. బుమ్రా ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని ఆరో ర్యాంకుకు చేరాడు. స్పిన్నర్ అక్షర్ పటేల్ ఏడుస్థానాలు ఎగబాకి 17వ ర్యాంకు దక్కించుకొన్నాడు. ఆల్‌రౌండర్ల కేటగిరీలో హార్దిక్ రెండో ర్యాంకులో, జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా టాప్‌లో నిలిచారు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్
టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్