Share News

ధోనీ మిడిలార్డర్‌లో ఆడాలి

ABN , Publish Date - Mar 18 , 2026 | 02:41 AM

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే) స్టార్‌ ఎంఎస్‌ ధోనీ ఆఖర్లో బ్యాటింగ్‌కు దిగడం సరికాదని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిల్లీర్స్‌ అభిప్రాయపడ్డాడు....

ధోనీ మిడిలార్డర్‌లో ఆడాలి

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే) స్టార్‌ ఎంఎస్‌ ధోనీ ఆఖర్లో బ్యాటింగ్‌కు దిగడం సరికాదని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిల్లీర్స్‌ అభిప్రాయపడ్డాడు. ధోనీకిదే చివరి సీజన్‌గా భావిస్తున్న వేళ అతను ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగతాడనే సందేహం అందరిలో నెలకొంది. ఇదే విష యమై ఏబీ స్పందిస్తూ.. ‘సీఎ్‌సకే అంటేనే ధోనీ గుర్తు కొస్తాడు. అతడివల్లే జట్టు బ్రాండ్‌ విలువ పెరిగింది. ధోనీ బ్యాటింగ్‌ జట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలిసిందే. గత సీజన్‌ మాదిరి అతను 8 లేక 9 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగితే ప్రయోజనం లేదు. కచ్చితంగా మిడిలార్డర్‌లో బరిలోకి దిగాలి. ఒకవేళ ఈ స్థానాల్లో ధోనీ ఫిట్‌ కాలేకపోతే అతను తుది జట్టులో లేకపోవడమే ఉత్తమం’ అని డివిల్లీర్స్‌ సూచించాడు.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో ఇంకా కలగానే ఆ ఆటగాళ్ల కోరిక!

NZ vs SA: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం

Updated Date - Mar 18 , 2026 | 02:41 AM