15 ఏళ్లకే శతక హోరు
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:05 AM
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సంచలన ప్రదర్శన నమోదైంది. రువాండాకు చెందిన 15 ఏళ్ల అమ్మాయి ఫ్యానీ యుటాగుషిమనిండే సెంచరీతో అదరగొట్టింది. ..
రువాండా టీనేజర్ ఫ్యానీ రికార్డు
లాగోస్: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సంచలన ప్రదర్శన నమోదైంది. రువాండాకు చెందిన 15 ఏళ్ల అమ్మాయి ఫ్యానీ యుటాగుషిమనిండే సెంచరీతో అదరగొట్టింది. నైజీరియా ఇన్విటేషనల్ మహిళా టీ20 టోర్నీలో ఘనా జట్టుపై 65 బంతుల్లో 17 ఫోర్లతో 111 పరుగులు సాధించింది. దీంతో పురుషుల, మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత పిన్నవయస్సులోనే శతకం బాదిన క్రికెటర్‌గా ఫ్యానీ రికార్డుకెక్కింది. గతంలో ఈ ఫీట్ ప్రొస్కోవియా అలకో (16 ఏళ్లు, ఉగాండా) పేరిట ఉండేది. అంతేకాకుండా అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన తొలి మహిళా అంతర్జాతీయ క్రికెటర్‌గానూ ఫ్యానీ ఘనత వహించింది. ఇక ఫ్యానీ బాదుడుతో ఈ మ్యాచ్‌లో ఘనాపై 122 పరుగుల భారీ తేడాతో రువాండా గెలిచింది.
ఇవి కూడా చదవండి:
అతడి స్థాయిని ఎవరూ భర్తీ చేయలేరు: కె. శ్రీకాంత్
రామ జన్మభూమిని దర్శించిన ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్, కెప్టెన్ పంత్..