ఏపీఎల్‌లో చోళ చీఫ్స్ బోణీ
ABN , Publish Date - Oct 10 , 2026 | 02:35 AM
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో చోళ చీఫ్స్ బోణీ చేసింది. శుక్రవారం నెక్లెస్ రోడ్‌లో జరిగిన రెండో రోజు పోటీల్లో చోళ జట్టు 6-2తో ఆతిథ్య కాకతీయ నైట్స్‌పై గెలిచింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో చోళ చీఫ్స్ బోణీ చేసింది. శుక్రవారం నెక్లెస్ రోడ్‌లో జరిగిన రెండో రోజు పోటీల్లో చోళ జట్టు 6-2తో ఆతిథ్య కాకతీయ నైట్స్‌పై గెలిచింది. చోళ ఆర్చర్ ఉస్కియానో సంధించిన బాణాలు పదికి పదికి పాయింట్లు సాధించి, ఆ జట్టు గెలుపునకు బాటలు వేయగా, ఆఖర్లో వెటరన్ దీపికా కుమారి అద్భుత ప్రదర్శనతో విజయాన్ని అందించింది.
ఇతర మ్యాచ్లుల్లో చేరో ఆర్చర్స్ 6-2తో రాజ్‌పుతానా రాయల్స్‌పై, పృథ్వీరాజ్ యోధాస్ 6-2తో మైటీ మరాఠా్‌సపై గెలిచాయి. శనివారం మైటీ మరాఠా్‌సతో చోళ, పృథ్వీరాజ్ యోధా్‌సతో చేరో ఆర్చర్స్, రాజ్‌పుతానా రాయల్స్‌తో కాకతీయ నైట్స్ తలపడనున్నాయి.
ఇవి కూడా చదవండి:
పోలీస్ మహిళా సిబ్బందిని రాహుల్ గాంధీ అసభ్యంగా తాకారు: తుషార్ మెహతా..
పదేళ్ల తర్వాత జట్టులోకి.. 33 బంతులు, 0 పరుగులు!
బీసీసీఐ క్రీడా కమిటీ బడ్జెట్ భారీగా పెంపు.. ఏకంగా రూ. 127 కోట్లు