మన గ్రూప్‌లోనే చైనా
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:40 AM
ప్రతిష్ఠాత్మక థామస్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లకు కఠినమైన డ్రా ఎదురైంది. ఈ టోర్నీలో...
భారత జట్లకు కఠినమైన డ్రా
థామస్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక థామస్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లకు కఠినమైన డ్రా ఎదురైంది. ఈ టోర్నీలో మన పురుషులు, మహిళల జట్లు.. చైనాతో కలిసి ఒకే గ్రూప్ నుంచి తలపడనున్నాయి. వచ్చేనెల 24న డెన్మార్క్‌లోని హార్సెన్స్ వేదికగా టోర్నీ మొదలవనుంది. థామస్ కప్‌లో భారత పురుషుల జట్టుతో పాటు చైనా, కెనడా, ఆస్ట్రేలియా గ్రూప్-ఎలో బరిలోకి దిగనుండగా.. ఉబెర్ కప్‌లో గ్రూప్-ఎ నుంచి చైనా, డెన్మార్క్, ఉక్రెయిన్‌లతో కలిసి భారత మహిళల బృందం పోటీపడనుంది. థామస్, ఉబెర్ కప్‌లలో మొత్తం 16 జట్లు 4 గ్రూపులుగా విడిపోయి తలపడతాయి.
ఇవి కూడా చదవండి..
జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు
సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..