Share News

సాత్విక్‌ జోడీ ఇంటికి

ABN , Publish Date - Mar 05 , 2026 | 05:20 AM

ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టికి చుక్కెదురైంది. ఈ భారత ద్వయం అనూహ్యంగా ఆరంభ రౌండ్లోనే...

సాత్విక్‌ జోడీ ఇంటికి

ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌

బర్మింగ్‌హామ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టికి చుక్కెదురైంది. ఈ భారత ద్వయం అనూహ్యంగా ఆరంభ రౌండ్లోనే ఇంటిబాట పట్టింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో సాత్విక్‌/చిరాగ్‌ జంట 21-23, 12-21తో మలేసియా జోడీ ఆరోన్‌ తాయి/కాయ్‌ గ్జింగ్‌ కాంగ్‌ చేతిలో ఓటమిపాలైంది. మిక్స్‌డ్‌లో భారత ద్వయం రోహన్‌/రుత్విక 12-21, 15-21తో ఫ్రాన్స్‌ జంట గిక్వెల్‌/డెల్ఫిన్‌ చేతిలో ఓటమిపాలైంది. సింగిల్స్‌లో భారత షట్లర్‌ ఆయుష్‌ శెట్టి 21-19, 9-21, 17-21తో అల్వి ఫర్హాన్‌ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడాడు.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ వ్యూయర్ షిప్‌లో సంచలన రికార్డ్!

ఐపీఎల్ 2026: చిన్నస్వామి స్టేడియంలోనే ఫైనల్ పోరు

Updated Date - Mar 05 , 2026 | 05:21 AM