Share News

క్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ

ABN , Publish Date - Mar 13 , 2026 | 02:58 AM

స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సాత్విక్‌/చిరాగ్‌ జోడీ క్వార్టర్స్‌ కు చేరింది. గురువారం హోరాహోరీగా జరిగిన డబుల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో...

క్వార్టర్స్‌లో సాత్విక్‌  జోడీ

స్విస్‌ ఓపెన్‌

బాసిల్‌: స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సాత్విక్‌/చిరాగ్‌ జోడీ క్వార్టర్స్‌ కు చేరింది. గురువారం హోరాహోరీగా జరిగిన డబుల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో సాత్విక్‌ ద్వయం 21-15, 15-21, 28-26తో యమషిట/ఒకామురాను జంటను చిత్తు చేసింది. ఇక అర్జున్‌/హరిహరన్‌ జంట రౌండ్‌-16లో ఓడింది. పురుషుల సింగిల్స్‌లో తరుణ్‌ మన్నేపల్లి ప్రీక్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించాడు. కెంటా నిషిమోటోతో తొలి రౌండ్‌లో తరుణ్‌కు వాకోవర్‌ లభించింది. తరుణ్‌ 16-21, 21-16, 7-2తో ఆధిక్యంలో ఉన్న దశలో నిషిమోటో వైదొలిగాడు. ఇక కిరణ్‌ జార్జ్‌ ప్రీక్వార్టర్స్‌ ఫైనల్లో, మాళవికా బన్సోడ్‌ మొదటి రౌండ్‌లో ఓడిపోయారు.

ఇవి కూడా చదవండి..

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..

Updated Date - Mar 13 , 2026 | 02:58 AM