‘15 పాయింట్లు’ సరికాదు
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:09 AM
బ్యాడ్మింటన్‌లో కొత్తగా ప్రవేశపెట్టాలనుకుంటున్న 15 పాయింట్ల పద్దతిని మాజీ షట్లర్, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ వ్యతిరేకించింది. ప్రస్తుతమున్న 21 పాయింట్లను...
ప్రస్తుత విధానమే బాగుంది
బ్యాడ్మింటన్‌లో కొత్త స్కోరింగ్‌పై సైనా నెహ్వాల్
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌లో కొత్తగా ప్రవేశపెట్టాలనుకుంటున్న 15 పాయింట్ల పద్దతిని మాజీ షట్లర్, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ వ్యతిరేకించింది. ప్రస్తుతమున్న 21 పాయింట్లను కుదిస్తే ఆటలో తీవ్రత, పోటీతత్వం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆటకున్న చరిత్రను దెబ్బతీయొద్దని కోరింది. ఇప్పుడు కొనసాగుతున్న స్కోరింగ్ (మూడు గేమ్స్ సిరీ్‌సలో 21 పాయింట్ల చొప్పున) విధానాన్ని 3గీ15 ఫార్మాట్‌కు మార్చేందుకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చే నెల 25న డెన్మార్క్‌లోని హార్సెన్స్‌లో జరిగే బీడబ్ల్యూఎఫ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనను సభ్యుల ఓటింగ్ కోసం ఉంచనున్నారు. ‘ఈ క్రీడలో ఎలాంటి మార్పులు తేవాలన్నా జాగ్రత్తగా ఆలోచించాకే అమలుపర్చాలి. ప్రస్తుత 21 పాయింట్ల పద్దతికి ఎన్నో ఏళ్ల నుంచి షట్లర్లు అలవాటు పడ్డారు. మార్పులు తీసుకొస్తే అవి ఈ క్రీడలోని పోటీ సమతుల్యతను దెబ్బతీయకుండా ఉండాలి’ అని సైనా సూచించింది.
ఇవి కూడా చదవండి...
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే