‘ఆసియా చాంపియన్‌షి్‌ప’ నుంచి సింధు అవుట్
ABN , Publish Date - Feb 01 , 2026 | 06:15 AM
బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షి్‌ప నుంచి ఏస్ షట్లర్ పీవీ సింధు తప్పుకొంది. దీంతో ఈ ఈవెంట్‌లో భారత పతక ఆశలకు గట్టిదెబ్బ తగిలే అవకాశముంది.
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షి్‌ప నుంచి ఏస్ షట్లర్ పీవీ సింధు తప్పుకొంది. దీంతో ఈ ఈవెంట్‌లో భారత పతక ఆశలకు గట్టిదెబ్బ తగిలే అవకాశముంది. సింధు నొప్పితో ఇబ్బందిపడుతున్నట్టు సమాచారం. వచ్చే వారం నుంచి జరిగే టోర్నీలో గ్రూప్-వైలో థాయ్‌లాండ్, మయన్మార్‌తో భారత్ ఆడనుంది. సింధు గైర్హాజరీలో సింగిల్స్ భారం తన్వీ శర్మ, ఉన్నతి హుడా, రక్షిత శ్రీ, మాళవిక భన్సోడ్‌పై పడనుంది. డబుల్స్‌కు ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ నేతృత్వం వహించనుంది.
ఇవి కూడా చదవండి:
ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్
టీ20 ప్రపంచ కప్ 2026: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు