Share News

భారత మహిళలకు కఠిన పరీక్ష

ABN , Publish Date - Feb 03 , 2026 | 05:52 AM

పీవీ సింధు తప్పుకోవడంతో.. ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో భారత మహిళల జట్టుకు కఠిన సవాల్‌ ఎదురుకానుంది. మంగళవారం టోర్నీ మొదలవనుంది...

భారత మహిళలకు కఠిన పరీక్ష

డబ్ల్యూపీఎల్‌లో నేడు

గుజరాత్‌ X ఢిల్లీ (రా. 7.30)

నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌

క్వింగ్‌డావో (చైనా): పీవీ సింధు తప్పుకోవడంతో.. ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో భారత మహిళల జట్టుకు కఠిన సవాల్‌ ఎదురుకానుంది. మంగళవారం టోర్నీ మొదలవనుంది. అయితే, ఫిట్‌నెస్‌ లేమితో సింధు తప్పుకోవడంతో ఆ లోటును 17 ఏళ్ల షట్లర్‌ తన్వీ శర్మ భర్తీ చేసే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా తన్వీ చెప్పుకోదగ్గ ప్రదర్శనతో ఆకట్టుకొంటోంది. ఉన్నతి హుడా, మాళవిక బన్సోడ్‌, రక్షిత శ్రీ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు. డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రితోపాటు ప్రియ, శ్రుతి, తనీషా ఆడనున్నారు. గ్రూప్‌-వైలో బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో మలేసియాతో భారత్‌ తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌, తరుణ్‌, కిడాంబి శ్రీకాంత్‌, ప్రణయ్‌, ఆయుష్‌.. డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ ప్రధానం కాగా.. సాయి ప్రతీక్‌, పృథ్వీ కృష్ణమూర్తి, హరిహరన్‌ మిగతా ఆటగాళ్లు. గ్రూప్‌-సిలో సింగపూర్‌, జపాన్‌తో భారత్‌ తలపడనుంది. ప్రతి గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు క్వార్టర్స్‌ చేరతాయి.

ఇవీ చదవండి:

ఆ వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి: మేరీ కోమ్

చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం

Updated Date - Feb 03 , 2026 | 05:52 AM