‘ఆల్ ఇంగ్లండ్’కు అడుగు దూరంలో లక్ష్య సేన్
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:42 AM
భారత ఏస్ షట్లర్ లక్ష్య సేన్.. ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ్‌సలో లక్ష్యసేన్ 21-16, 18-21, 21-15తో విక్టర్ లాయ్ పై...
సెమీ్‌సలో విక్టర్‌పై గెలుపు
బర్మింగ్‌హామ్: భారత ఏస్ షట్లర్ లక్ష్య సేన్.. ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ్‌సలో లక్ష్యసేన్ 21-16, 18-21, 21-15తో విక్టర్ లాయ్ (కెనడా)పై గెలిచాడు. ఆదివారం జరిగే తుది పోరులో లి చున్ యి (చైనీస్ తైపీ)తో తలపడనున్నాడు. మెగా ఈవెంట్‌లో సేన్ ఫైనల్ చేరడం ఇది రెండోసారి. 2022లో రన్నర్‌పగా నిలిచాడు. భారత ఆటగాళ్లలో ప్రకాష్ పడుకోన్ (1980), పుల్లెల గోపీచంద్ (2001) మాత్రమే ఆల్ ఇంగ్లండ్ టైటిల్‌ను సొంతం చేసుకోగా.. ప్రకాష్ నాథ్ (1974), సైనా నెహ్వాల్ (2015) రన్నర్‌పలుగా నిలిచారు. గంటా 37 నిమిషాలపాటు సాగిన పోరులో సేన్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించాడు. కాళ్లపై బొబ్బలతోపాటు చివరి గేమ్ లో కండరాలు పట్టేసి ఇబ్బందిపడినా.. కసిగా పోరాడాడు. మరో సెమీస్‌లో వరల్డ్ నెం:2 కున్లావత్ విటిడ్‌సర్న్ (థాయ్‌లాండ్)పై చున్ యి 21-14, 18-21, 21-16తో నెగ్గాడు.
ఇవి కూడా చదవండి:
టీమిండియాలో ప్రతి ప్లేయర్ డేంజరే.. మేం చాలా జాగ్రత్తగా ఆడాలి: కివీస్ కెప్టెన్ శాంట్నర్
ఈసారైనా గెలవండి.. లేదంటే ఆ చోకర్స్ ట్యాగ్ మీకిచ్చేస్తా: కివీస్‌కు డేల్ స్టెయిన్ వార్నింగ్