Share News

శ్రీకాంత్‌ అవుట్‌

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:29 AM

సీనియర్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో...

శ్రీకాంత్‌ అవుట్‌

స్విస్‌ ఓపెన్‌

బాసిల్‌: సీనియర్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో శ్రీకాంత్‌ 21-15, 12-21, 4-21తో జాసన్‌ చేతిలో ఓడిపోయాడు. ప్రణయ్‌ ప్రత్యర్థికి వాకోవర్‌ ఇచ్చాడు. మరో మ్యాచ్‌లో కిరణ్‌ జార్జ్‌ 23-21, 21-19తో మాజీ ప్రపంచ చాంపియన్‌ లో కిన్‌ యూ (సింగపూర్‌)పై నెగ్గి రెండో రౌండ్‌కు చేరాడు. మిక్స్‌డ్‌లో ధ్రువ్‌ కపిల/తనీషా క్రాస్టో 21-15, 21-14తో జెస్పెర్‌/అమేలీపై నెగ్గి ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌/చిరాగ్‌ 21-19, 21-19తో కీట్‌/కుబోపై విజయంతో రౌండ్‌-16కి చేరారు. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా, తన్వీ శర్మ, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌/రుత్విక శివానీ కూడా తొలి రౌండ్‌లో పరాజయం పాలయ్యారు.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్

టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్

Updated Date - Mar 12 , 2026 | 05:29 AM