ఆరంభంలోనే శ్రీకాంత్ అవుట్
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:17 AM
తెలుగు షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఓర్లీన్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నమెంట్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్...
పారిస్: తెలుగు షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఓర్లీన్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నమెంట్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 12-21, 10-21తో మాగ్నస్ జోహన్నెసెన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. ఇతర భారత షట్లర్లలో ఆయుష్ శెట్టి 17-21, 21-10, 21-17తో కిరణ్ జార్జ్‌పై, అన్మోల్ ఖర్బ్ 21-12, 21-16తో అరిన్ (టర్కీ)పై, మాళవిక బన్సోడ్ 21-18, 21-14తో సుంగ్ షు యున్ (చైనీస్ తైపీ)పై, ఇషారాణి 21-19, 21-19తో అమేలీ షుల్జ్ (మలేసియా)పై గెలిచి రెండో రౌండ్‌లో ప్రవేశించారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో రుత్విక-రోహన్ జోడీ తొలి రౌండ్‌లో గెలవగా, పురుషుల డబుల్స్‌లో అచ్యుత్-అర్జున్ జోడీ, సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ ఆదిలోనే ఓటమిపాలై ఇంటిముఖం పట్టారు. తన్వీ శర్మ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది.
ఇవి కూడా చదవండి..
జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు
సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..