వావ్..జగ్షేర్
ABN , Publish Date - Oct 17 , 2026 | 02:37 AM
భారత యువ షట్లర్ జగ్షేర్ సింగ్ జూనియర్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పతకంతో మెరిశాడు.
జూ. ప్రపంచ బ్యాడ్మింటన్లో కాంస్యం కైవసం
కైరో (ఈజిప్టు): భారత యువ షట్లర్ జగ్షేర్ సింగ్ జూనియర్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పతకంతో మెరిశాడు. ఇక్కడ జరిగిన జూనియర్ బాలుర సింగిల్స్ సెమీఫైనల్లో పంజాబ్కు చెందిన 15 ఏళ్ల జగ్షేర్ 6-15, 15-13, 3-15తో రాదిత్య వర్దానా (ఇండోనేసియా) చేతిలో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భారత్కు ఇది 13వ పతకం. ఇప్పటిదాకా ఓ స్వర్ణం, ఐదు రజతాలు, ఏడు కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి.
ఇవీ చదవండి:
వర్చువల్ సమావేశంలో ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య వాగ్వాదం.! వీడియో వైరల్
గుజరాతీ గర్బాకు స్విస్ అంబాసిడర్ మాయా టిస్సాఫి ఫిదా.!