Share News

ఆసీస్‌ ‘ఎ’దే సిరీస్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 02:49 AM

ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన రెండో అనధికార వన్డేలోనూ భారత్‌ ‘ఎ’ నిరాశపర్చింది.

ఆసీస్‌ ‘ఎ’దే సిరీస్‌
Australia A

  • రెండో వన్డేలోనూ ఓడిన భారత్‌ ‘ఎ’

పుదుచ్చేరి: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన రెండో అనధికార వన్డేలోనూ భారత్‌ ‘ఎ’ నిరాశపర్చింది. రజత్‌ పటీదార్‌ (67), అనుకుల్‌ రాయ్‌ (34 నాటౌట్‌) మినహా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ ‘ఎ’ 69 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ ఫలితంతో ఆసీస్‌ మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సిరీస్‌ను దక్కించుకున్నట్టయ్యింది.


ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ ‘ఎ’ 49.5 ఓవర్లలో 275 పరుగులు చేసింది. సామ్‌ కోన్‌స్టాస్‌ (67), ఫిలిప్‌ (58) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. అర్షద్‌ ఖాన్‌కు మూడు, యష్‌ ఠాకూర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ ‘ఎ’ 45.2 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. జాన్సన్‌కు మూడు.. మెరెడిత్‌, తన్వీర్‌ సంఘాలకు రెండేసి వికెట్లు లభించాయి.


ఇవి కూడా చదవండి:

పోలీస్ మహిళా సిబ్బందిని రాహుల్ గాంధీ అసభ్యంగా తాకారు: తుషార్ మెహతా..

ప‌దేళ్ల త‌ర్వాత జ‌ట్టులోకి.. 33 బంతులు, 0 పరుగులు!

బీసీసీఐ క్రీడా కమిటీ బడ్జెట్‌ భారీగా పెంపు.. ఏకంగా రూ. 127 కోట్లు

Updated Date - Oct 10 , 2026 | 02:49 AM