ఆసియా క్రీడల్లో భారత్‌కు షాక్.. అనారోగ్యంతో భారత అథ్లెట్ వరుణ్ సన్యాల్ ఔట్
ABN , Publish Date - Sep 20 , 2026 | 05:30 PM
ఆసియా క్రీడల్లో భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో పురుషుల 77 కేజీల విభాగంలో బరిలోకి దిగాల్సిన భారత అథ్లెట్ వరుణ్ సన్యాల్ పోటీ నుంచి తప్పుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA)లో పురుషుల 77 కేజీల విభాగంలో బరిలోకి దిగాల్సిన భారత అథ్లెట్ వరుణ్ సన్యాల్ పోటీ నుంచి తప్పుకున్నాడు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా ఆదివారం తన బస చేస్తున్న క్రూయిజ్ షిప్‌లో అతడు స్పృహ తప్పి పడిపోయినట్లు ఎంఎంఏ స్పోర్ట్స్ ఫఎడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు నిఖిల్ కుందేరా వెల్లడించారు.
నేపాల్‌కు చెందిన అథ్లెట్ వరుణ్ సన్యాల్‌ను గమనించి.. సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉంది. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌తో లేకపోవడంతో వరుణ్ సన్యాల్ క్వార్టర్ ఫైనల్ నుంచి డిస్‌క్వాలిఫై అయినట్లు సమాచారం.
ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పతకం
భారత్ నుంచి ఆసియా క్రీడల MMA జట్టులో ఎంపికైన ఇద్దరు క్రీడాకారుల్లో వరుణ్ సన్యాల్ ఒకడు. 2026 జనవరిలో చైనాలో జరిగిన ఆసియా MMA ఛాంపియన్‌షిప్‌లో వరుణ్ కాంస్య పతకం సాధించాడు. దీంతో ఆసియా క్రీడల్లో అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అనూహ్యంగా అనారోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
టీ20ల్లో ప్రపంచ రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
ఆసియా క్రీడలు: బంగ్లా ఘోర ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్