Share News

క్విమ్సీ ఆశలన్నీ కాంస్యంపైనే

ABN , Publish Date - Sep 20 , 2026 | 05:18 AM

ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత టెక్‌బాల్‌ స్టార్‌ క్విమ్సీ డిసౌజా ఫైనల్‌ రేసు నుంచి...

క్విమ్సీ ఆశలన్నీ కాంస్యంపైనే

ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత టెక్‌బాల్‌ స్టార్‌ క్విమ్సీ డిసౌజా ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో క్విమ్సీ 12-7, 9-12, 7-12తో సుమయా (ఇండోనేసి యా) చేతిలో ఓడింది. దీంతో కాంస్య పతకం కోసం ఆదివారం టాప్‌ సీడ్‌ యివునా సకమోటో (జపాన్‌)తో క్విమ్సీ తలపడనుంది. కాగా.. భారత్‌కే చెందిన అహ్మద్‌తో కలిసి క్విమ్సీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ కాంస్య పతకపోరులో నిలిచిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు

మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 05:18 AM