జ్యోతి సురేఖకు షాక్
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:39 AM
ఆసియాడ్‌లో భారత అథ్లెట్లు, బాక్సర్లు, షూటర్ల జోరు కొనసాగుతోంది. షూటింగ్..మహిళల షాట్‌గన్‌లో నీరూ ధండా స్వర్ణ రేసులో నిలవగా, 4గీ100 మీ. మిక్స్‌డ్ రిలేలో భారత బృందం ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది...
14 ఏళ్ల కొరియా బాలిక చేతిలో ఓటమి
స్వర్ణంపై నీరూ గురి
బాక్సింగ్‌లో మరో 3 పతకాలు ఖరారు
నగోయ: ఆసియాడ్‌లో భారత అథ్లెట్లు, బాక్సర్లు, షూటర్ల జోరు కొనసాగుతోంది. షూటింగ్..మహిళల షాట్‌గన్‌లో నీరూ ధండా స్వర్ణ రేసులో నిలవగా, 4గీ100 మీ. మిక్స్‌డ్ రిలేలో భారత బృందం ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. తద్వారా పతకానికి చేరువైంది. బాక్సర్ల పంచ్ అదరడంతో మరో మూడు పతకాలు ఖరారయ్యాయి. గత మూడు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలతో భళా అనిపించిన స్టార్ ఆర్చర్ జ్యోతిసురేఖకు కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ప్రీక్వార్టర్‌ఫైనల్లో షాక్ తగిలింది.
జ్యోతి సురేఖ ప్రీక్వార్టర్స్‌లోనే..
కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ వెన్నం జ్యోతి సురేఖను 14 ఏళ్ల కొరియా బాలిక కాంగ్ యోన్‌సియో కంగుతినిపించింది. ప్రీక్వార్టర్‌ఫైనల్లో కాంగ్ 150కి 150 పాయింట్లు స్కోరు చేసింది. దాంతో 146 పాయింట్లే సాధించిన తెలుగు ఆర్చర్ జ్యోతి సురేఖకు ఓటమి తప్పలేదు. షూటా్‌ఫకు దారితీసిన మరో రౌండ్-16 మ్యాచ్‌లో తెలుగు యువ ఆర్చర్ చికిత తానిపర్తి, తైపీకి చెందిన చెన్ యీ సువాన్ 148 స్కోరుతో సమంగా నిలిచారు. దాంతో నిర్వహించిన షూటా్‌ఫలో చికిత విజేతగా నిలిచి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. ఉత్కంఠ భరిత కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత విభాగం ప్రీక్వార్టర్‌ఫైనల్లో గణేశ్ మణిరత్నం 149-148తో సహచరుడు సాహిల్ జాదవ్‌పై నెగ్గాడు.
దూసుకెళ్తున్న నీరూ..
మహిళల షాట్‌గన్‌లో కొత్త చరిత్ర సృష్టించే దిశగా నీరూ ధండా బుల్లెట్‌లా దూసుకుపోతోంది. మహిళల ట్రాప్ విభాగంలో సోమవారం క్వాలిఫికేషన్ పోటీలు ముగిసేసరికి 26 ఏళ్ల నీరూ నాలుగు రౌండ్ల తర్వాత మొత్తం 95 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. మంగళవారం 25 షాట్లతో కూడిన తుది రౌండ్‌లో షూటర్లు తలపడతారు. అది కూడా ముగిశాక మొదటి ఎనిమిది స్థానాలలో నిలిచిన షూటర్లు ఫైనల్‌కు చేరతారు.
సెమీస్ లో లవ్లీనా, ప్రియ, కపిల్
బాక్సింగ్‌లో ఇంతకుముందే ముగ్గురు సెమీఫైనల్‌కు క్వాలిఫై కావడంతో మనకు కనీసం మూడు కాంస్య పతకాలు ఖరారయ్యాయి. తాజాగా లవ్లీనా బోర్గోహైన్ (మహిళల 75కి.), ప్రియా ఘంఘాస్ (మహిళల 60కి.), కపిల్ పొఖారియా (పురుషుల 90కి.) సెమీఫైనల్లోకి అడుగుపెట్టడంతో కనీసం మరో 3 కాంస్య పతకాలు భారత్‌కు దక్కనున్నాయి. అంకుష్ పంగల్ (80కి.), పర్వీన్ హు డా (మహిళల 65కి.), నరేందర్ బేర్వల్ (పురుషుల 90కి.) ఇప్పటికే సెమీస్ చేరిన విషయం విదితమే.
అంకిత/రుతుజ తొలి రౌండ్‌లోనే..
టెన్నిస్ మహిళల డబుల్స్‌లో అంకిత రైనా/రుతుజ భోసాలే ద్వయం 7-5, 3-6, 5-10తో కజకిస్థాన్ జంట యులియా పుటింట్సేవా/అన్నా డానలినాపై పోరాడి ఓడి .మొదట రౌండ్‌లోనే నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సుమిత్ నగాల్ 3-2తో హాంగ్ సియోంగ్ చాన్ (దక్షిణ కొరియా)పై ఆధిక్యంలో ఉన్న దశలో వర్షం కురవడంతో మ్యాచ్‌ను మంగళవారానికి వాయిదా వేశారు.
స్క్వాష్ క్వార్టర్స్‌లో పురుషులు, మహిళలు
భారత పురుషులు, మహిళల జట్లు స్క్వాష్ టీమ్ విభాగంలో రౌండ్-8కి చేరాయి. ప్రీక్వార్టర్స్‌లో మూడో సీడ్ మహిళల జట్టు 2-1తో జపాన్‌పై, పురుషుల జట్టు 3-0తో దక్షిణ కొరియాపై విజయం సాధించి ముందంజ వేశాయి.
హాకీ సెమీస్ లో పాకిస్థాన్‌తో అమీతుమీ
పురుషుల హాకీ సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత్ ఢీకొననుంది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మనోళ్లు 10-0తో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసి పూల్ ‘ఎ’ టాపర్‌గా నిలిచారు. రెండో సెమీఫైనల్లో మలేసియా-దక్షిణకొరియా తలపడతాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్..