హాకీ ఫైనల్‌కు అమ్మాయిలు
ABN , Publish Date - Oct 01 , 2026 | 02:44 AM
ఆసియా క్రీడల మహిళల హాకీలో స్వర్ణం కోసం భారత్ సుదీర్ఘ నిరీక్షణ ఈసారి ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన అమ్మాయిలు హాకీలో ఫైనల్ చేరి పసిడి పోరులో నిలిచారు. బుధవారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో...
నగోయ: ఆసియా క్రీడల మహిళల హాకీలో స్వర్ణం కోసం భారత్ సుదీర్ఘ నిరీక్షణ ఈసారి ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన అమ్మాయిలు హాకీలో ఫైనల్ చేరి పసిడి పోరులో నిలిచారు. బుధవారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో భారత్ 2-0తో దక్షిణ కొరియాను చిత్తు చేసింది. ఇషికా చౌదరి (44వ నిమిషం), కెప్టెన్ సలీమా టెటె (48వ) చెరో గోల్ చేశారు. శుక్రవారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చైనాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక, ఆసియాడ్‌లో భారత మహిళల హాకీ జట్టు ఒకే ఒకసారి విజేతగా నిలిచింది. ఢిల్లీ వేదికగా 1982లో జరిగిన ఆసియా క్రీడల్లో మనోళ్లు స్వర్ణం నెగ్గారు.
టీమ్ స్క్వాష్‌లో పతకాలు ఖరారు:
స్క్వాష్ వ్యక్తిగత విభాగాల్లో పతకాలు నెగ్గిన భారత క్రీడాకారులు టీమ్ ఈవెంట్లలోనూ అదరగొడుతున్నారు. టీమ్ విభాగాల్లో పురుషులు, మహిళల జట్లు సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టి కనీసం కాంస్యాలు ఖాయం చేసుకున్నాయి. పురుషుల క్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంప్ భారత్ 2-0తో కువైట్‌ను ఓడించింది. మహిళల క్వార్టర్స్‌లో అనాహత్ నేతృత్వంలోని భారత్ 2-0తో సింగపూర్‌ను చిత్తుచేసింది.
టెన్నిస్‌లో సుమిత్ క్వార్టర్స్‌కు.. దక్షిణేశ్వర్ ఇంటికి: టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సుమిత్ నగాల్ క్వార్టర్‌ఫైనల్ చేరగా, దక్షిణేశ్వర్ సురేశ్ పోరాటం ముగిసింది. ప్రీక్వార్టర్స్‌లో సుమిత్ 6-3, 6-2తో సెర్జీ ఫోమిన్ (ఉజ్బెకిస్థాన్)పై నెగ్గగా, దక్షిణేశ్వర్ 3-6, 4-6తో చున్ సిన్ సెంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో భారత జోడీలు శ్రీరామ్ బాలాజీ/అనిరుధ్ చంద్రశేఖర్, యుకీ భాంబ్రీ/దక్షిణేశ్వర్.. తమ ప్రత్యర్థుల చేతిలో ఓడి ఇంటిబాట పట్టాయి.
ఇవీ చదవండి:
ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ రికార్డ్.. వరుసగా రెండు పతకాలతో..
ఆసియా క్రీడలు: ఒకే రోజు నాలుగు స్వర్ణాలు.. ఆర్చరీలో హ్యాట్రిక్