Share News

వెండి వెలుగులు

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:58 AM

తీవ్ర ఒత్తిడి.. నరాలు తెగే ఉత్కంఠ.. నాటకీయ పరిణామాల మధ్య ఐదు షూటా్‌ఫలు కాచుకొన్న హైదరాబాద్‌కు చెందిన పిస్టల్‌ షూటర్‌ ఇషా సింగ్‌.. ఎట్టకేలకు రజతంతో మురిసింది. హోరాహోరాగా సాగిన మహిళల...

 వెండి వెలుగులు

  • షూటింగ్‌లో ఇషాకు రజతం

  • సత్తాచాటిన మురళీ, గుల్వీర్‌

  • జావెలిన్‌ త్రోలో యశ్‌, రోహిత్‌ అదుర్స్‌

  • రన్నర్‌ విత్యరికార్డు ప్రదర్శన

నగోయ: తీవ్ర ఒత్తిడి.. నరాలు తెగే ఉత్కంఠ.. నాటకీయ పరిణామాల మధ్య ఐదు షూటా్‌ఫలు కాచుకొన్న హైదరాబాద్‌కు చెందిన పిస్టల్‌ షూటర్‌ ఇషా సింగ్‌.. ఎట్టకేలకు రజతంతో మురిసింది. హోరాహోరాగా సాగిన మహిళల 25 మీ. పిస్టల్‌ వ్యక్తిగత ఈవెంట్‌ ఫైనల్లో ఇషా సింగ్‌ షూటా్‌ఫలో స్వర్ణం చేజార్చుకొంది. పసిడి పోరు చివరి సిరీ్‌సలో ఇషా, చైనా షూటర్‌ జియారుగ్జువాన్‌ గ్జియావో 38 పాయింట్లతో గేమ్స్‌ రికార్డును సమం చేయడంతో.. ఫలితం షూటా్‌ఫకు దారి తీసింది. ఇందులోని ఐదు షాట్లలో సింగ్‌ మూడు మిస్‌ కాగా.. గ్జియావో రెండు షాట్లు మాత్రమే గురితప్పడంతో ఆమె అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం సొంతం చేసుకొంది. 2023 హాంగ్‌ఝౌ క్రీడల్లో కూడా ఇదే విభాగంలో సింగ్‌ రజతం సాధించింది. కాగా, 25 మీ. పిస్టల్‌ టీమ్‌ ఫైనల్లో ఇషా, మను బాకర్‌, రాహి సర్నోబాత్‌ల త్రయం 1727 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఒలింపిక్‌ పతక విజేత మను ఈ క్రీడల్లో ఒక్క పతకం కూడా సాధించలేక పోయింది

15-sports.jpg

ట్రక్‌ డ్రైవర్‌ కూతురు సంచలనం

పీటీ ఉష రికార్డు బద్దలు

ఆసియా క్రీడల మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో తమిళనాడు అథ్లెట్‌ విత్యా రామ్‌రాజ్‌ రికార్డు ప్రదర్శనతో అదరగొట్టింది. 42 ఏళ్ల క్రితం స్ర్పింట్‌ దిగ్గజం పీటీ ఉష నెలకొల్పిన జాతీయ రికార్డును బద్దలుకొడుతూ కాంస్యం దక్కించుకొంది. విత్య 54.75 సెకన్ల వ్యక్తిగత బెస్ట్‌ టైమింగ్‌ను నమోదుచేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 1984 ఒలింపిక్స్‌లో ఉష నమోదు చేసిన 55.42 సెకన్ల జాతీయ రికార్డును నిత్య అధిగమించింది. కాగా, గత ఆసియా క్రీడల్లోనే విత్య..ఉష రికార్డును సమం చేసింది. అయితే, మూడేళ్ల తర్వాత అంటే.. ఈసారి ఆ టైమింగ్‌ను 0.67 సెకన్ల తేడాతో దాటేసింది. కోయంబత్తూరుకు చెందిన ట్రక్‌ డ్రైవర్‌ కూతురైన 28 ఏళ్ల విత్య.. ఎన్నో ఆర్ధిక ఇబ్బందులను దాటుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. తొలుత 100 మీటర్లు, 200 మీటర్ల రేసులో పోటీపడ్డ విత్య.. 2017లో 400 మీటర్ల హర్డిల్స్‌ విభాగానికి మారింది. అనతికాలంలోనే తన ఈవెంట్‌లో అంచలంచెలుగా ఎదిగిన విత్య.. తాజా ప్రదర్శనతో దేశానికి మరో ఉషలా అవతరించింది.


మెరిసిన పింకీ..

కురా్‌షలో రెండు ఆసియాడ్‌ పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా పింకీ బల్హారా రికార్డులకెక్కింది. మహిళల 78 కిలోల్లో పింకీ కాంస్యం అందించింది. క్వార్టర్స్‌లో 3-0తో గరమ్‌ లిమ్‌ (కొరియా)పై గెలిచిన పింకీ.. సెమీ్‌సలో 0-5తో సుమిన్‌ మొ (కొరియా) చేతిలో ఓడి కాంస్యానికే పరిమితమైంది. 2018 జకార్తా క్రీడల్లో 52 కిలోల కేటగిరీలో పింకీ రజతం సాధించింది.

మిక్స్‌డ్‌ రిలేలో ఫైనల్‌కు..

అథ్లెటిక్స్‌ 4గీ100 మీ. మిక్స్‌డ్‌ రిలేలో గురీందర్‌వీర్‌ సింగ్‌, అభినయ రాజరాజన్‌, అనిమేష్‌ కుజుర్‌, హరిత భద్రతో కూడిన భారత జట్టు తుది పోరులో అడుగుపెట్టింది. భారత బృందం 41.54 సె.తో రేస్‌ను పూర్తి చేసి చైనా (41.52సె.) తర్వాత హీట్‌-2లో రెండో స్థానం సాధించింది. ఓవరాల్‌గా థాయ్‌లాండ్‌, చైనా తర్వాత భారత జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఫైనల్లో కూడా సత్తా చాటితే మనకు మరో పతకం ఖాయం.

ఇషా సింగ్‌కు సీఎం రేవంత్‌ అభినందన

పతకం సాధించిన ఇషా సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. ఇషాసింగ్‌ పోరాట స్ఫూర్తి క్రీడాలోకానికి ఆదర్శమని, అంతర్జాతీయ వేదికలపై మరెన్నో గొప్ప విజయాలు అందుకుని దేశ ప్రతిష్టను, తెలంగాణ కీర్తిని చాటాలని రేవంత్‌ ఆకాంక్షించారు.

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. లాంగ్‌ జంపర్‌ మురళీ శ్రీశంకర్‌, రేసర్‌ గుల్వీర్‌ సింగ్‌ వెండి మెరుపులు మెరిపించగా, షూటింగ్‌లో ఇషా సింగ్‌ సత్తాచాటింది. పారుల్‌ చౌదరి మరో కాంస్యం సొంతం చేసుకోగా.. హర్డిల్స్‌లో విత్యా రామ్‌రాజ్‌ నాలుగు దశాబ్దాల జాతీయ రికార్డును తిరగరాసింది. స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా దూరమైనా.. యశ్‌వీర్‌, రోహిత్‌ డబుల్‌ పోడియం ఫినిష్‌తో ఆ లోటు తెలియకుండా చేశారు. కురా్‌షలో పింకీ కంచుమోత మోగించింది. బాక్సింగ్‌లో లవ్లీనా, ప్రియ, కపిల్‌ సెమీస్‌ చేరి మరో మూడు పతకాలు ఖాయం చేశారు. మొత్తంగా క్రీడలకు 9వ రోజు 8 పతకాలతో మనోళ్లు అదరగొట్టినా.. స్వర్ణం మాత్రం చిక్కలేదు. దీంతో భారత్‌ మొత్తం 45 మెడల్స్‌తో 12వ స్థానంలో నిలిచింది.

1000-sports.jpg

ఈ వార్తలు కూడా చదవండి

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌..

Updated Date - Sep 29 , 2026 | 05:58 AM