Share News

గుభాళించిన గుల్వీర్‌..

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:43 AM

అంచనాలకు తగ్గట్టే లాంగ్‌ జంపర్‌ మురళీ శ్రీశంకర్‌ రజతం సాధించాడు. గత క్రీడల్లోనూ రజత పతకం సొంతం చేసుకొన్న శ్రీశంకర్‌ రెండో ప్రయత్నంలో..

గుభాళించిన గుల్వీర్‌..

అంచనాలకు తగ్గట్టే లాంగ్‌ జంపర్‌ మురళీ శ్రీశంకర్‌ రజతం సాధించాడు. గత క్రీడల్లోనూ రజత పతకం సొంతం చేసుకొన్న శ్రీశంకర్‌ రెండో ప్రయత్నంలో 8.07 మీటర్లు దూకి ద్వితీయ స్థానంలో నిలిచాడు. అయితే, నాలుగో ప్రయత్నంలో కాలికి దెబ్బ తగలడంతో.. మళ్లీ దూకే సాహసం చేయలేదు. చైనా జంపర్‌ యుహావ్‌ షి (8.17 మీ.) స్వర్ణం, ఉజ్బెకిస్థాన్‌ అథ్లెట్‌ అన్వర్‌ అన్వరోవ్‌ (8.06 మీ.) కాంస్యం సాధించారు. కాగా, లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ గుల్వీర్‌ సింగ్‌ ఈ క్రీడల్లో రెండో రజతం సొంతం చేసుకొన్నాడు. 1500 మీ. రేస్‌లో గుల్వీర్‌ 3 నిమిషాల 36.72 సెకన్ల వ్యక్తిగత బెస్ట్‌ టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచాడు. 10000 మీ. రేస్‌లో కూడా గుల్వీర్‌ రజతం సాధించిన సంగతి తెలిసిందే. మహిళల 5000 మీ. రేస్‌లో పారుల్‌ 15 నిమిషాల 14.61 సెకన్ల టైమింగ్‌తో కాంస్యం సాధించింది. 3000 మీ. రేస్‌లో కూడా ఆమె కంచు పతకం దక్కించుకొంది. పురుషుల జావెలిన్‌ త్రోలో యశ్‌వీర్‌ (85.72 మీ.), రోహిత్‌ (84.35 మీ.) రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్యాలు సాధించారు. శ్రీలంక త్రోయర్‌ రుమేష్‌ పతిరగే (88.55 మీ.) స్వర్ణం ఎగరేసుకుపోయాడు.

ఈ వార్తలు కూడా చదవండి

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌..

Updated Date - Sep 29 , 2026 | 05:43 AM