Share News

వయసు 13 స్వర్ణాలు 2

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:46 AM

చైనా టీనేజ్‌ స్విమ్మర్‌ యు జిది ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శనతో అదరగొడుతోంది. 13 ఏళ్ల వయసులోనే ఆసియాడ్‌ బరిలోకి దిగి రికార్డు సృష్టించిన ఈ చైనా బాలిక...

వయసు 13 స్వర్ణాలు 2

ఆసియాడ్‌లో చైనా బాలిక సంచలనం

నగోయ: చైనా టీనేజ్‌ స్విమ్మర్‌ యు జిది ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శనతో అదరగొడుతోంది. 13 ఏళ్ల వయసులోనే ఆసియాడ్‌ బరిలోకి దిగి రికార్డు సృష్టించిన ఈ చైనా బాలిక.. ఇప్పుడు ఏకంగా టోర్నీలో రెండు స్వర్ణ పతకాలు కొల్లగొట్టి వారెవ్వా అనిపించింది. తొలిరోజు పోటీల్లో మహిళల స్విమ్మింగ్‌ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో పసిడి నెగ్గిన జిది.. రెండో రోజైన సోమవారం 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే విభాగంలోనూ టైటిల్‌ సాధించి రెండో బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకుంది. అంతేకాదు సరికొత్త ఆసియాడ్‌ రికార్డు టైమింగ్‌ను నెలకొల్పడం విశేషం. అంతకుముందు మొదటి స్వర్ణం నెగ్గే క్రమంలోనూ ఈ క్రీడల రికార్డు టైమింగ్‌ను నమోదు చేసింది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న జిది.. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫ్రీస్టయిల్‌ రిలే ఈవెంట్‌లో కాంస్యం నెగ్గి పిన్న వయసులో ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకం అందుకున్న స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించింది.

ఇవి కూడా చదవండి:

ఆసియా గేమ్స్: కుమారుడి టీమ్ ఓటమి.. మాధవన్ రియాక్షన్ ఇదే!

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. రిజర్వ్ ఓపెనర్ రేసులో సాయి సుదర్శన్

Updated Date - Sep 22 , 2026 | 05:46 AM