Share News

ఏపీఎల్‌ బరిలో ‘ఆసియా’ విజేతలు

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:23 AM

ఆసియా క్రీడల్లో పతకాల మోత మోగించిన భారత ఆర్చర్లు మరో రెండ్రోజుల్లో మొదలయ్యే ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌లో) సీజన్‌-2కు...

ఏపీఎల్‌ బరిలో ‘ఆసియా’ విజేతలు

8న లీగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా క్రీడల్లో పతకాల మోత మోగించిన భారత ఆర్చర్లు మరో రెండ్రోజుల్లో మొదలయ్యే ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌లో) సీజన్‌-2కు సన్నద్ధమవుతున్నారు. గురువారం నుంచి జరిగే ఈ లీగ్‌లో తెలుగు ఆర్చర్లు జ్యోతి సురేఖ, ధీరజ్‌, చికితారావు, గణేష్‌ మణిరత్నంతో పాటు ఆసియా క్రీడల్లో మెరిసిన కుమ్‌కుమ్‌ మోహోద్‌, సాహిల్‌ రాజేష్‌, దిగ్గజ ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్‌, ఒజాస్‌ ప్రవీణ్‌, టోక్యో ఒలింపిక్స్‌ విజేత గాజోజ్‌, ఎల్లా గిబ్సన్‌ వంటి మేటి క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఈనెల 8 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌లో జరిగే ఈ పోటీల్లో ఆరు ఫ్రాంచైజీల తరఫున 48 మంది ఆర్చర్లు బరిలోకి దిగుతున్నారు. చీరో ఆర్చర్స్‌ (జార్ఖండ్‌), చోళ చీఫ్స్‌ (తమిళనాడు), కాకతీయ నైట్స్‌ (తెలంగాణ), మైటీ మరాఠాస్‌ (మహారాష్ట్ర), పృథ్వీరాజ్‌ యోధాస్‌ (ఢిల్లీ), రాజ్‌పుతానా రాయల్స్‌ (రాజస్థాన్‌) జట్లు లీగ్‌లో తలపడనున్నాయి.

ఇవి కూడా చదవండి..

బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..

మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 06 , 2026 | 05:23 AM