ఫైనల్లో అమృత
ABN , Publish Date - Oct 17 , 2026 | 02:11 AM
అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్లో భారత క్రీడాకారిణి అమృత పూజారి ఫైనల్‌కు దూసుకెళ్లింది
కోమల్‌కు కాంస్యం జూఅండర్-23 ప్రపంచ రెజ్లింగ్
లాస్ వెగాస్: అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్లో భారత క్రీడాకారిణి అమృత పూజారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 72 కిలోల విభాగం సెమీఫైనల్లో అమృత 10-8తో వెన్జిన్ కియు (చైనా)ను ఓడించింది. అంతకు ముందు క్వార్టర్స్‌లో 7-1తో సబిర్జనోవా (కజకిస్థాన్)ని చిత్తుచేసింది. స్వర్ణ పతక బౌట్లో ఇరినా జబ్లోస్కా (ఉక్రెయి న్)తో అమృత అమీ తుమీ తేల్చుకోనుంది. ఇక, మహిళల 59 కిలోల విభాగంలో కోమల్ కాంస్య పతకం దక్కించుకుంది. అంతకుముందు సెమీస్‌లో ఓడిన కోమల్..కాంస్య పతక పోరులో 7-2తో విక్టోరియా కుసైనోవా (కజకిస్థాన్)పై గెలిచింది.
ఇవి కూడా చదవండి:
విండీస్‌తో ఐదో టీ20: అర్ష్‌దీప్ సింగ్‌కు గాయం.. భువీకి పిలుపు
మద్యం నా జీవితాన్ని తారుమారు చేసింది.. అది నాకు పునర్జన్మే: చాహల్\