పెళ్లి చేసుకోమంటూ తల్లిదండ్రుల బలవంతం.. ఈ యువతి ఏం చేసిందంటే..
ABN , Publish Date - Mar 08 , 2026 | 01:51 PM
పెళ్లి చేసుకోమంటూ తల్లిదండ్రులు బలవంతం చేయటంతో ఓ యువతి వినూత్న నిర్ణయం తీసుకుంది. పెళ్లి ఒత్తిడినుంచి తప్పించుకోవడానికి ఏకంగా గుండు చేయించుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: పెళ్లి చేసుకోమంటూ తల్లిదండ్రులు బలవంతం చేయటంతో ఓ యువతి వినూత్న నిర్ణయం తీసుకుంది. పెళ్లి ఒత్తిడినుంచి తప్పించుకోవడానికి ఏకంగా గుండు చేయించుకుంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో యువతి మాట్లాడుతూ.. ‘నేను మీకు ఓ నిజం చెప్పాలనుకుంటున్నాను. నేను గుండు చేయించుకున్నాను. అది కూడా బలవంతంగా గుండు చేయించుకున్నాను. నా జుట్టంటే నాకు చాలా ఇష్టం. కానీ, ఇలా చేయాల్సి వచ్చింది’..
‘పెళ్లి చేసుకోమని మా తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు. ఏం చేయమంటారు చెప్పండి. మగాళ్లు గుండు చేయించుకుంటే ఏం కాదు.. ఆడవాళ్లు చేయించుకుంటే మాత్రం సమస్య వస్తుంది. జనం నన్ను కోపంగా చూస్తున్నారు. నేనేం చేశాను. నా జుట్టంటే నాకు చాలా ఇష్టం. అయినా కూడా బలవంతంగా చేయాల్సి వచ్చింది. పెళ్లి చేసుకోమంటూ ఇంత ఒత్తిడి ఎందుకు చేస్తున్నారు. నాకు కామెంట్ బాక్స్‌లో సింపథీ అవసరం లేదు. ఒత్తిడి ఉన్న అమ్మాయిలు ఏదైనా చేయండి’..
‘ఒకసారి మీ జీవితం చేతుల్లోంచి వెళ్లిపోతే ఏమీ చేయలేం’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ‘పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేసే వారిపై కేసు పెట్టే చట్టాలు రావాలి. అప్పుడే ఒత్తిడి చేసే వారి తిక్క కుదురుతుంది’..‘నువ్వు చాలా మంచి పని చేశావు. కెరీర్ కంటే పెళ్లి ఎక్కువేం కాదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఆమె ఎవరు? ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందన్నది తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి
వైభవంగా కనకదుర్గమ్మ మహా కుంభాభిషేకం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
ఎండాకాలం రాగి జావ తాగితే ఇంత మంచిదా..