ఎండాకాలం రాగి జావ తాగితే ఇంత మంచిదా..
ABN , Publish Date - Mar 08 , 2026 | 01:27 PM
తీవ్రమైన ఎండల వల్ల వడదెబ్బ, నీరసం, డీహైడ్రేషన్, కళ్లు తిరగడం, తలనొప్పి వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. సరైన పోష్టికాహారం తీసుకోవటం ద్వారా ఎండల వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. మరీ ముఖ్యంగా రాగి జావ తాగటం ఎండాకాలంలో ఎంతో మేలు చేస్తుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: మార్చి నెల మొదలై 10 రోజులు కూడా కాలేదు అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండల కారణంగా జనం పలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. తీవ్రమైన ఎండల వల్ల వడదెబ్బ, నీరసం, డీహైడ్రేషన్, కళ్లు తిరగడం, తలనొప్పి వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. సరైన పోష్టికాహారం తీసుకోవటం ద్వారా ఎండల వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. మరీ ముఖ్యంగా రాగి జావ తాగటం ఎండాకాలంలో ఎంతో మేలు చేస్తుంది.
సూపర్ ఫుడ్ రాగులు
రాగులను ఇంగ్లీష్‌లో ఫింగర్ మిల్లెట్ అని అంటారు. రాగుల్లో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి. కాల్షియం, ఫైబర్, ప్రోటీన్లు, ఇనుము, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఎముకల బలానికి, రక్తహీనత నివారణకు, మధుమేహ నియంత్రణకు, బరువు తగ్గడానికి రాగులు సూపర్ ఫుడ్‌గా పనిచేస్తాయి. ఎండాకాలం తరచుగా రాగి జావ తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
రాగులు చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. రాగి జావ తాగినపుడు వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది.
రాగి జావ అలసటను తగ్గించి తక్షణ శక్తి ఇస్తుంది.
పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం ఉండటం వల్ల ఎముకలు, దంతాల ఆరోగ్యానికి రాగులు చాలా మంచిది.
ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఆకలిని నియంత్రించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
రాగుల్లో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు అధికంగా రాగి జావ తీసుకోకూడదు.
ఇవి కూడా చదవండి
మహిళలకు బెస్ట్ టూరిస్ట్ ప్రదేశాలు ఇవే
మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 40 సెకెన్లలో కనిపెట్టండి