Woman Risks Childrens Lives: నువ్వసలు తల్లివేనా.. వ్యూస్ కోసం ఇంతకు తెగిస్తావా..
ABN , Publish Date - Jan 17 , 2026 | 01:32 PM
ఓ మహిళ తన ఇంటి ముందున్న బావి గోడపై తన ఇద్దరు పిల్లలతో నిల్చుంది. బ్యాక్ గ్రౌండ్‌లో వస్తున్న పాటకు డ్యాన్స్ చేస్తోంది. తను డ్యాన్స్ చేయటం మాత్రమే కాకుండా పిల్లలతో డేంజరస్ స్టంట్స్‌కు తెరతీసింది.
ఉత్తర భారత దేశంలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ మహిళ సోషల్ మీడియాలో వ్యూస్ తెచ్చుకోవటం కోసం ఏ తల్లీ చేయకూడని పని చేసింది. తన కన్నబిడ్డల ప్రాణాలను రిస్క్‌లో పెట్టింది. బావి గోడపై తన ఇద్దరు పిల్లలతో కలిసి డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ మహిళ తన ఇంటి ముందున్న బావి గోడపై తన ఇద్దరు పిల్లలతో నిల్చుంది. బ్యాక్ గ్రౌండ్‌లో వస్తున్న పాటకు డ్యాన్స్ చేస్తోంది. తను డ్యాన్స్ చేయటం మాత్రమే కాకుండా పిల్లలతో డేంజరస్ స్టంట్స్‌కు తెరతీసింది. ఇద్దరినీ రెండు చేతులతో పట్టుకుని బావి గోడపై వేలాడదీసింది. అటూ ఇటూ ఊపింది. తను కూడా స్టెప్పులు వేసింది. ప్రమాదం గురించి సరిగా తెలియని పిల్లలు తల్లి చేస్తున్న పనికి నవ్వటం మొదలెట్టారు.
ఆ మహిళ మరోసారి వారిని బావిలో వేలాడదీసి డ్యాన్స్ చేసింది. ఈ సంఘటన ఎప్పుడు.. ఎక్కడ.. జరిగిందన్నది తెలియరాలేదు. ఇక.. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘నువ్వు మాతృత్వానికి మాయని మచ్చ తెస్తున్నావు. పిల్లలకు ఏమైనా అయితే.. ఛీఛీ’.. ‘వ్యూస్ కోసం ఈ మధ్య బరి తెగిస్తున్నారు. ఇలాంటి వారిని ఊరికే వదిలేయకూడదు. అరెస్ట్ చేయాలి’.. ‘ పోలీసులు ఆ మహిళ ఎవరో గుర్తించి ఆమెను అరెస్ట్ చేయాలి’ అని కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నాగు పాముతో అతి చేశాడు.. ప్రాణాలు పోయాయ్..
చైన్ స్నాచింగ్స్ కలకలం.. భయాందోళనలో జనం