వాల్యూమ్ తగ్గించమంటే వాదన.. యువతిని దించేసిన విమాన సిబ్బంది!
ABN , Publish Date - Mar 11 , 2026 | 03:18 PM
విమాన ప్రయాణం అంటే ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో.. అదే స్థాయిలో కొన్ని కఠిన నియమనిబంధనలు కూడా ఉంటాయి. కానీ, ఇటీవల కొంతమంది ప్రయాణికులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడం, విమాన సిబ్బందిని ఇబ్బంది పెట్టడం చూస్తూనే ఉన్నాం..
ఇంటర్నెట్ డెస్క్: విమాన ప్రయాణం అంటే ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో.. రూల్స్ కూడా అంతే కఠినంగా ఉంటాయి. కానీ, ఇటీవల కొంతమంది ప్రయాణికులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడం, విమాన సిబ్బందిని ఇబ్బంది పెట్టడం చూస్తూనే ఉన్నాం. ఓ యువతి విమానంలో చేసిన రచ్చకు సిబ్బంది ఆమెకు సరైన బుద్ధి చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మయామి నుంచి టంపాకు వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్(American Airlines) విమానంలో ఒక ప్రయాణికురాలు తన ఫోన్‌లో హై వాల్యూమ్‌లో వీడియోలు చూడటం వివాదానికి దారితీసింది. ఆమె చేసిన పనికి తోటి ప్రయాణికులు ఇబ్బంది పడటంతో విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
వైరల్ వీడియోలో కనిపిస్తున్నట్లు.. ఓ యువతి విమానం ఎక్కే సమయంలో తన ఫోన్‌లో హై వాల్యూమ్‌లో వీడియోలు ప్లే చేసింది. తొటి ప్రయాణికులు ఇబ్బంది పడటం చూసి విమాన సిబ్బంది ఆమె వద్దకు వచ్చి హెడ్ ఫోన్ లేకుండా అలా హై వాల్యూమ్‌లో వీడియోలు ప్లే చేయడం నిబంధనలకు విరుద్దమని చెప్పారు. ఆ యువతి విమాన సిబ్బంది మాటలు లెక్క చేయకుండా పోలీసులను రమ్మనండి వారితో మాట్లాడుతా అంటూ వాగ్వాదానికి దిగింది. దాంతో సిబ్బంది, పోలీసులు ఆమెను విమానం నుంచి దిగిపోవాలని చెప్పారు. వెంటనే ఆ యువతి ‘నేను సగం వాల్యూమ్‌లో 30 సెకన్ల పాటు వీడియో ప్లే చేసాను, అందుకే మీరు నన్ను దించేస్తారా’ అంటూ ఘర్షణను దిగింది. రూల్స్ అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తప్పవంటూ యువతిని విమానం నుండి బయటకు పంపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి:
మహిళకు పునర్జన్మ ఇచ్చిన రోడ్డుపై గుంత.. ఎవ్వరూ ఊహించని అద్భుతం ఇది..
మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రం కీలక నిర్ణయం