Share News

చెన్నై మహిళకు వచ్చిన పార్శిల్.. అందులో ఏమున్నాయో తెలిస్తే షాకవడం ఖాయం..

ABN , Publish Date - Feb 22 , 2026 | 04:18 PM

చెన్నైలోని ప్యారిస్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణంలో పని చేస్తున్న మహిళ కోసం ఓ వ్యక్తి పార్శిల్ తీసుకొచ్చాడు. సెక్యూరిటీ గార్డుకు ఆ పార్శిల్ ఇచ్చి ఆమెకు ఇవ్వాలని చెప్పి వెళ్లిపోయాడు. ఆ పార్శిల్ ఓపెన్ చేసి చూసి అందరూ నివ్వెరపోయారు.

చెన్నై మహిళకు వచ్చిన పార్శిల్.. అందులో ఏమున్నాయో తెలిస్తే షాకవడం ఖాయం..
woman receives skull parcel

చెన్నైలోని ప్యారిస్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణంలో పని చేస్తున్న మహిళ కోసం ఓ వ్యక్తి పార్శిల్ తీసుకొచ్చాడు. సెక్యూరిటీ గార్డుకు ఆ పార్శిల్ ఇచ్చి ఆమెకు ఇవ్వాలని చెప్పి వెళ్లిపోయాడు. ఆ పార్శిల్ ఓపెన్ చేసి చూసి అందరూ నివ్వెరపోయారు. ఎందుకంటే ఆ పార్శిల్‌లో ఒక మనిషి పుర్రె, ఎముకలు, విభూది ఉన్నాయి. దుకాణదారుడు వెంటనే పోలీసులకు పిర్యాదు చేశారు (woman receives skull parcel).


ప్యారిస్‌లోని ఓ దుకాణంలో వ్యాసర్పాడికి చెందిన శ్రుతి అనే మహిళ పని చేస్తోంది. ఆ మహిళ పని చేస్తున్న దుకాణం వద్దకు ఓ వ్యక్తి పార్శిల్ తీసుకొచ్చాడు. సెక్యూరిటీ గార్డుకు ఆ పార్శిల్ ఇచ్చి వెళ్లిపోయాడు. సెక్యూరిటీ గార్డు శ్రుతికి ఆ పార్శిల్ తీసుకెళ్లి ఇవ్వగా ఆమె దానిని తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఆ షాప్ యజమాని అందరి ముందే ఆ పార్శిల్‌ను ఓపెన్ చేసి చూశాడు. లోపల ఒక మనిషి పుర్రె, ఎముకలు, విభూది ఉన్నాయి. వాటిని చూసి అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు (human bones in package).


షాప్ యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు (mysterious parcel case). శ్రుతి కుటుంబానికి, అదే షాప్‌లో పని చేసే దినేశ్ అనే వ్యక్తి కుటుంబానికి మధ్యలో గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రుతిని భయపెట్టేందుకే దినేశ్ అలా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దినేశ్‌తో పాటు అతడి ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

మీ కళ్ల షార్ప్‌నెస్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో కుందేలు ఎక్కడుందో 7 సెకెన్లలో గుర్తించండి..


భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. చర్చలు రీషెడ్యూల్..

Updated Date - Feb 22 , 2026 | 04:18 PM